మనోజ్ పెళ్లైన నాలుగు రోజులకే అలాంటి పని చేసిన విరానికా..మంచు ఫ్యామిలీకి ఇది కోలుకోలేని షాక్..!?

ప్రజెంట్ ఇండస్ట్రీలో రాజకీయాలలో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . దానికి మెయిన్ రీజన్ ఆయన రీసెంట్ గా దివంగత నేత భూమ నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మంచు మనోజ్.. రాజకీయా నేత కూతురుని పెళ్లి చేసుకోవడంతో రాజకీయాలలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే మంచు లక్ష్మి ఇంట్లో గత శుక్రవారం రాత్రి వేదమంత్రాల మధ్య మూడు ముళ్ళతో ఒకటయ్యారు ఈ జంట .

ఈ పెళ్లి మొదటి నుంచి మంచు మోహన్ బాబుకు ..మంచు విష్ణుకు ఆయన భార్య విరానికకు ఇష్టం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే పెళ్లిలో కూడా వీళ్ళు ఎక్కడా కూడా కనిపించలేదు . ఏదో గెస్ట్ లా వచ్చి గెస్ట్ లా వెళ్లిపోయారు . ఈ క్రమంలోని మంచు విష్ణు పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కొందరు ఆకతాయిలు రీసెంట్గా మంచు విష్ణు భార్య విరానిక చేసిన పనికి ముడిపెడుతూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మంచు విరానిక ఎంత టాలెంటెడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

లండన్ లో పుట్టి పెరిగిన విరానిక మంచు విష్ణుని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఇక పిల్లలు పెరిగి పెద్దవడంతో మళ్లీ వ్యాపారం మీద దృష్టి పెట్టింది విరానిక . అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే ఆభరణాలు, జమాలజీ , ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకుంది విరానిక. కాగా భారత్లో విరానిక అనే పేరుతో బోటిక్ కూడా లంచ్ చేసింది . ఇప్పుడు ప్రజెంట్ ఆ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరింపజేసేసింది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాలో ఒకటైన లండన్ లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించింది. కేవలం చిల్డ్రన్ కోసం “మైసన్ అవా ” పేరుతో విరానిక ఈ స్టోర్ ఓపెన్ చేసింది. 2 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పిల్లల వరకు ఇక్కడ అన్ని రకాల దుస్తులు లభిస్తాయి.

మంచు విష్ణుకి పెళ్లయిన నాలుగు రోజుల్లోనే ఇలా కొత్త స్టోర్ ని ప్రారంభించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతుంది. విరానికకి ఇష్టం లేకపోవడం వల్లే మంచు విష్ణు కూడా భూమా మౌనిక రెడ్డికి దూరంగా ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విరానిక కజిన్ అవుతుంది .ఈ క్రమంలోనే రాజకీయాల బంధుత్వం కారణంగా రామలక్ష్మణులాంటి అన్నదమ్ములు విడిపోయారు అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!

 

Share post:

Latest