అల్లుడితో క‌లిసి `ద‌స‌రా` పాటకు స్టెప్పులేసిన కీర్తి సురేష్ త‌ల్లి.. వీడియో వైర‌ల్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలోని `చ‌మ్కీల అంగిలేసి..` సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎక్క‌డ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఆ పాట‌కు ప్ర‌తి ఒక్క‌రూ తెగ రీల్స్ చేసేస్తున్నారు.

అయితే తాజాగా ఈ పాటకు కీర్తి సురేష్ త‌ల్లి, అల‌నాటి న‌టి మేన‌క‌ కాలు క‌దిపారు. కీర్తి సోద‌రి భ‌ర్త కూడా డ్యాన్స్ చేశారు. అల్లుడితో క‌లిసి మేన‌క `చ‌మ్కీల అంగిలేసి..` త‌మిళ్ వెర్షన్ కు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మేన‌క స్వ‌యంగా ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. దీంతో ఈ వీడియో కాస్త వైర‌ల్ గా మారింది.

https://www.instagram.com/reel/CqVRu77DzEA/?utm_source=ig_web_copy_link