జగన్ సేమ్ కాన్సెప్ట్..దమ్ముంటే 175..వర్కౌట్ కష్టమే!

రాజకీయాల్లో ఎలాంటి  పరిస్తితులునైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ బాగా కష్టపడుతున్నారు. వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకుని సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవమే. పైగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీని ఓడించి టి‌డి‌పి విజయం సాధించింది. దీంతో వైసీపీకి ఇంకా ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

ఇదే క్రమంలో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయనున్నాయనే ప్రచారం మొదలైంది. దాదాపు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని చెప్పవచ్చు. రెండు పార్టీల పొత్తు ఉంటే వైసీపీకి దెబ్బ తగలడం ఖాయం. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు, జగన్ వెళుతున్నారు. పదే పదే పొత్తు లేకుండా చేసేలా టి‌డి‌పి-జనసేన పార్టీలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. దమ్ముంటే రెండు పార్టీలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని మాట్లాడుతున్నారు. తాజాగా తిరువూరు సభలో కూడా జగన్ అదే తరహాలో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ సింగిల్ గా పోటీ చేయాలని జగన్ చెబుతున్నారు. అంటే ఇలా సవాల్ చేసి రెచ్చగొట్టి, వాళ్ళు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు లబ్ది జరుగుతుందనేది జగన్ కాన్సెప్ట్. కానీ ఆ కాన్సెప్ట్ పెద్దగా వర్కౌట్ కాదనే చెప్పాలి. ఆల్రెడీ పొత్తు ఫిక్స్ అయిపోతుంది.

గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్లే వైసీపీకి అన్నీ సీట్లు వచ్చి గెలిచింది. ఓట్లు భారీగా చీలి వైసీపీకి బెనిఫిట్ జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్తితి ఉండదనే చెప్పాలి. పొత్తు ఉంటే వైసీపీకి డ్యామేజ్ ఖాయమనే చెప్పాలి.