ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్ లైన్ ట్రాన్సక్షన్.. చాలా సులువుగా..!!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ కి మక్కువ చూపుతున్నారు. ఫోన్ పే , గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో డబ్బు అసలు లేకుండా పోతోంది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా ఎక్కువగా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు. అయితే ఇలా కొన్నిసార్లు జరిపేటప్పుడు ఇంటర్నెట్ సదుపాయం అందకపోవచ్చు. దీంతో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకమీదట ఆన్లైన్ కష్టాలు నెట్ వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్లైన్ విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది చాలా మందికి తెలియకపోవచ్చు.. వాటి గురించి తెలుసుకుందాం.

ఇండియాలో దాదాపుగా అన్ని బ్యాంకులు యూపీఐ ప్రాసెస్ తోనే ప్రారంభిస్తాయి *99# సర్వీస్ ప్రారంభించింది. ఇందులో వినియోగదారుడు చేయవలసిందిగా తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నుండి *99# అనే నెంబర్ కి డయల్ చేయాలి. దీనివల్ల ఇంటర్నెట్ మెనూ కనిపిస్తుంది. దీని ద్వారా సులువుగా బ్యాంకింగ్ సేవలను కూడా పొందవచ్చు. ఇందులో బ్యాలెన్స్ , విచారణ వంటి సర్వీసులతో పాటు యూపీఐ పిన్ సెట్ చేయడం, మార్చడం వంటివి కూడా చేసుకోవచ్చు.

మొదట మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన రిజిస్ట్రేషన్ మొబైల్ నుండి *99# డయల్ చేయాలి. ఆ తర్వాత మీకు చూపించిన మెనూ వస్తుంది.
1). సెండ్ మనీ
2). రిక్వెస్ట్ మనీ
3). చెక్ బ్యాలెన్స్
4). మై ప్రొఫైల్
5). పెండింగ్ రిక్వెస్ట్
6). ట్రాన్సాక్షన్
7). యూపీఐపిన్

ఇందులో మీరు డబ్బు పంపించడానికి సెండ్ మనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ అకౌంట్ నుంచి డబ్బు పంపించాలనుకుంటున్నారు. ఆ అకౌంట్ ను సెలెక్ట్ చేసుకుని సెండ్ చేయాలి.

మొబైల్ నెంబర్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎంచుకుంటే రిసీవర్ యూపీఐ ఖాతాకు లింకు చేయబడిన మొబైల్ నెంబర్ను టైప్ చేసి సెండ్ చేయాలి.

మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసి సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

చెల్లింపు కోసం రీమార్క్ ని ఎంటర్ చేయాలి.
మొత్తం పూర్తి ట్రాన్సాక్షన్ చేయడానికి యూపీఐ పిన్ ని ఎంటర్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్ గా పూర్తి చేస్తే మీ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. ఇలా ఏవైనా ఆఫ్లైన్ సేవలతో మనీని సెండ్ చేసుకోవచ్చు.