అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ప్రభాస్ ను మించిపోయిందా..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా ఉన్న హీరోలు ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు కచ్చితంగా రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉంటారు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చిందంటే..అదే రేంజ్ లో మార్కెట్ వ్యాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. కచ్చితంగా తమ రెమ్యూన రేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు నటీనటులు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే పని చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడంతో తన మార్కెట్ వాల్యూ కూడా పెరగడం జరిగింది.

Prabhas to attend Allu Arjun's 'Pushpa' pre-release event? Here's  everything we know | Regional Indian Cinema
దీంతో అల్లు అర్జున్ ఏకంగా రూ .100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇప్పుడు పుష్ప-2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకి ఏకంగా రూ.125 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాని రూపొందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిత్రంతో అల్లు అర్జున్ ఒక ప్రాజెక్టుకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. T- సిరీస్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి ఏకంగా అల్లు అర్జున్ రూ .125 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్ని మించి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని చెప్పవచ్చు. బాహుబలి సినిమా పుణ్యమా అంటూ పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించిన ప్రభాస్ అప్పటినుంచి తాను చేస్తున్న చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు లే.. దాదాపుగా ఒక్కో సినిమాకి రూ.100 నుంచి రూ.120 కోట్ల రూపాయలు చార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ ప్రభాస్ కంటే రూ .5కోట్ల ఎక్కువ అమౌంట్ తో అగ్రస్థానంలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.