ఆస్కార్ వచ్చిన రాజమౌళికి బొక్క తప్పదా..? ఇదేం కర్మ సార్ మీకు..?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు అందుకోబోతుంది . తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు అందుకోబోతుండడంతో జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఈ క్రమంలోని పలువురు స్టార్ సెలబ్రిటీస్ ముందుగానే జక్కన్నకు విష్ చేస్తున్నారు . అయితే సినీ విశ్లేషకులు మాత్రం రాజమౌళికి ఆస్కార్ వచ్చిన భారీ బొక్క తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రాజమౌళి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తారో. ఫ్యాన్స్ కి హీరోలకు సరైన గౌరవం దక్కకపోతే..నానా హంగామా చేస్తారు. ఫ్యాన్స్ స్టార్ హీరోకి అవార్డు రాకపోతే మాత్రం అస్సలు ఊరుకోరు . సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తారు . ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమా తెర్కెక్కించడమే పెద్ద గగనంగా మారిన రాజమౌళికి ఇప్పుడు ఆస్కార్ అవార్డు వస్తే అందులో ఎవరికి ఎక్కువ వాటా ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది .

ఈ క్రమంలోని ఇద్దరు హీరోలు ఈ పాటలో డాన్స్ చేశారు. ఇద్దరు సరి సమానంగా ఈక్వల్ గా ఎఫర్ట్స్ పెట్టి డాన్స్ చేయడం వల్ల ఈ పాట అంత సూపర్ డూపర్ హిట్ అయింది .దానికి తగ్గట్టే రాహుల్ కూడా ఈ పాటకు ప్రాణం పోశాడు . అయితే ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత రాజమౌళి స్పీచ్ ఎలా ఉండబోతుంది ఏ హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతాడు ..చరణ్ గురించి ఎక్కువ పోగిడి .. తారక్ గురించి తక్కువగా మాట్లాడితే నందమూరి ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ తప్పదు ..అలా అని తారక్ ని పొగిడి చరణ్ ని తక్కువ చేస్తే మెగా ఫ్యామిలీ చేతిలో తిప్పలు తప్పవు ..ఈ క్రమంలోనే రాజమౌళికి పెద్ద చిక్కే వచ్చి పడింది.

ఇద్దరికీ ఈక్వల్ సమానం ఇచ్చిన సరే ఫాన్స్ ఒప్పుకోరు కచ్చితంగా చరణే ఎక్కువ అంటూ ఇప్పటికే మెగా ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మెగావ్శ్ నందమూరి ఫ్యాన్స్ వార్ పిక్స్ కి చేరింది . రాజమౌళి ఆస్కార్ అందుకున్నాక ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మరికొందరు రాజమౌళికి ఆస్కార్ వచ్చినా కర్మ తప్పదు ట్రోలింగ్ కి కూడా అవ్వాల్సిందే అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేసేస్తున్నారు. చూడాలి మరి ఈ తిప్పల నుంచి రాజమౌళి ఏ విధంగా తప్పించుకుంటాడో..?

Share post:

Latest