సావిత్రి సమాధిపై ఏముందో తెలుసా.. చూస్తే ఎవరికైనా ఏడుపు రావాల్సిందే..!

మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే.. ఆ కళ్లు వెలుగులు చిమ్మాయి. ఆ నవ్వు వెన్నెల పూయించింది. ఆ హొయలు నెమలిని తలపించింది. ఆ మాట వీణలా మోగింది. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార గుర్తుకు వస్తుంది. నాటి నుంచి నేటి వరకు.. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన అసమాన ప్రతిభాశాలి. అసలు సావిత్రి.. అనే ఈ మూడు అక్షరాలు వింటే చాలు.. తెలుగు ప్రేక్షకులు పులకరించి పోతారు. ఆమె నటన ఒక గ్రంథాలయం.

ఇలా ఆ రోజుల్లో అప్పటి తరం అగ్ర హీరోలకు దీటుగా నటించి ఒకానొక సమయంలో హీరోలే ఆమెతో నటించాలంటే జాగ్రత్త పడే అంతగా తన నటనతో గుర్తింపు పొందిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి జీవితం గురించి మాట్లాడితే మన తెలుగు దిగ్గజానటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు వంటి అగ్ర న‌టులు కూడా ఆమెతో నటించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారట. ఇలా వారు కొన్ని సందర్భాలలో సావిత్రితో నటించాలంటే భయం కూడా వేసేదట, అలా సావిత్రితో నటించడం ఓ గొప్ప అనుభవం అంటూ ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు వంటి నటులు కూడా చెప్పుకొచ్చారు.

ఇలా సావిత్రి తన నట జీవితంలో ఓ మకుటం లేని మహారాణిగా ఇప్పటికీ మిగిలిపోయారు. కానీ తన కుటుంబ విషయాలలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ప్రధానంగా తన చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఆమె తన జీవితంలో ఎంతోమందికి ఎన్నో రకాల గుప్త దానాలు చేశారు. ఈ విధంగా దానాలు చేస్తూ సావిత్రి తన చివరి రోజుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఆమె చివరగా నటించిన సినిమా చివరకు మిగిలేది.. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా లభించింది. ఆమె జీవితం ఎంతోమందికి ఆదర్శం. చాలామంది వర్ధమాన నటీమణులకు జీవితాన్ని ఎలా కాపాడుకోవాలని నేర్పించే గుణపాఠం.

సావిత్రి గారి ఆఖరి కోరిక:
సావిత్రి గారు తను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో వివరించిందట. చావులోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని తీసుకుంటుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా సానుభూతితో కన్నీళ్లు పెట్టవద్దు. ఈ సినీ పరిశ్రమలో కూడా ఎవరు ఈ హీనంగా చూడకుండా మరణం లేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు ఒక పూలమాలను ఉంచండి… ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం అని సావిత్రి అన్నారట. సమాధి మీద ఏమి రాయాలో చనిపోయే ముందు సావిత్రి గారు చెప్పి తన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటి చెప్పారు.