“నాటు నాటుకి ఆస్కార్” రావడంతో వేణు స్వామి భార్య ఏం చేసిందో తెలుసా..? ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న లెటేస్ట్ వీడియో..!!

ప్రజెంట్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ప్రపంచ దేశాలలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి సంచలనాన్ని క్రియేట్ చేసింది . రీసెంట్గా సినీ జనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డున సైతం అందుకొని ఇండియన్ ఫిలిం హిస్టరీని తిరగరాసింది ఆర్ఆర్ఆర్.

కాగా ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టీంకు దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.. ఫాన్స్ . ఈ క్రమంలోని వీణ శ్రీవాణి తనదైన స్టైల్ లో ఆర్ఆర్ఆర్ కు ట్రిబ్యూట్ అందించింది . నాటు నాటు సాంగ్ ని తన వీణతో అద్భుతంగా వాయిస్తూ.. అందరి హృదయాలను దోచుకునింది వీణ శ్రీవాణి . ఎంతో ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉండే నాటు నాటు సాంగ్ ఆమె తన వీణలో ప్రదర్శించారు .

ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు వీణ శ్రీవాణిలో ఉన్న ఈ ప్రత్యేకమైన టాలెంట్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఆమె ముఖంలో చిరునవ్వు ఎంత చూడ చక్కగా ఉందో.. అంతే చక్కగా వినసొంపుగా ఆమె వీణ వాయిస్తే వినాలనిపిస్తుంది అంటూ కామెంట్స్ ను పోస్ట్ చేశారు . ఇలా నాటు నాటు సాంగ్ కి తనదైన స్టైల్ లో కంగ్రాట్స్ అందించింది వీణ శ్రీవాణి..!!

 

Share post:

Latest