చరణ్ హీరో అవ్వడం కోసం మెగా స్టార్ అంత పెద్ద త్యాగం చేసాడా..? ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా.. వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చిరంజీవి ..ప్రజెంట్ టాలీవుడ్ లో సీనియర్ హీరోగా ముందుకు వెళ్తున్నాడు . అంతేకాదు తన కొడుకును స్టార్ హీరోగా చేశాడు మెగాస్టార్ చిరంజీవి. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు వచ్చిన సరే మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ కె పట్టం కట్టారు మెగా అభిమానులు .

ఈ క్రమంలోనే మెగాస్టార్ కొడుకు నటించిన సినిమా మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు అందుకోబోతుంది . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి – చరణ్ కోసం చేసిన త్యాగం బయటపడింది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి – చరణ్ పేర్లు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవికి నటన అంటే ఎంత ఇష్టమో.. డాన్స్ లో కూడా చాలా స్కిల్స్ నేర్చుకున్నాడు . ఆ కారణంగానే మెగాస్టార్ గా ఇండస్ట్రీలో రాజమౌలేస్తున్నాడు .

అయితే తన తర్వాత చరణ్ కూడా అంతటి పెద్ద హీరో అవ్వాలని మెగాస్టార్ చిరంజీవి కొడుకు కోసం పెద్ద త్యాగమే చేశాడట. అప్పట్లో ఆయన సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఇంట్లో కొడుకుకి సపరేట్గా క్లాసులు తీసుకునేవాడట . ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం చరణ్ కు కాలేజ్ అయిపోగానే నటన పరంగా కొన్ని క్లాసెస్ తీసుకునే వారట . అంతేకాదు అలా చరణ్ కోసం క్లాసెస్ తీసుకోవడానికి మెగాస్టార్ కొన్ని సినిమాలను వదులుకున్నాడంటూ కూడా తెలుస్తుంది . వాటిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను సైతం వదులుకున్నాడట . చిరంజీవి ఆదివారం షూట్ కి వెళ్లేవారు కాదట. చరణ్ ని ట్రైన్ చేయడానికి అప్పటినుంచి మెగాస్టార్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్లడని ..ఆ రిజల్ట్ కారణంగానే ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అంటూ సినీ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది..!!

Share post:

Latest