Dasara: దసరా సినిమాకి నాని అంత అందుకున్నాడా..?

దసరా సినిమా మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. నాని ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తూ ఉన్నారు. మార్చి 30న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తూ ఉన్నారు.ప్రమోషన్ కూడా అదే స్థాయిలో చేస్తూ ఉండడంతో ఈ సినిమా విజయం పైన కచ్చితంగా నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక నాని కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం అన్ని చోట్లకు తిరుగుతూనే ఉన్నారు. వీరితోపాటు కీర్తి సురేష్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొనుంది.

Dasara Box Office: Nani's Film Has Already Recovered The Cost & A 12 Crore  Profit Even Before Its Release? Here's What We Know!
ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటిటి రైట్స్ కూడా భారీ ధరకే దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం వంటి భాషలకు చెందిన స్ట్రిమింగ్ రైట్స్ ను NET FLIX సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిందీ స్ట్రిమింగ్ రైట్స్ మాత్రం హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం.. విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా ఓటీటిలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్ర క్లైమాక్స్ కోసం రూ.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. దసరా సినిమా కోసం నాని రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రం కోసం నాని ఏకంగా రూ .20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపై నాని అంటే టాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ అన్నట్లుగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

Share post:

Latest