ఆ వివాదంలో అడ్డంగా బుక్కైన మహేష్.. ఇలా జరిగిందేంటి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన చేసిందో అప్పటి.నుంచి అమరావతి రైతుల ఉద్యమం, పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. మూడు రాజధానుల ప్రకటన చేసి ఇంతకాలం అయిన కూడా ఇప్పటివరకు అమరావతి పరిస్థితి పై ఎవరికీ క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితులో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కారణంగా అమరావతి  గొడవలో తల దూర్చాల్సిన అవసరం ఏర్పడుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మహేష్ ,త్రివిక్రమ్ ల మూవీకి ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆ టైటిల్‌ని అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గుంటూరు బ్యాక్ డ్రాప్ గా అమరావతికి చెరో వైపున హీరోకు సంబంధం ఉన్న ఊళ్ళలో ఉండే రెండు కుటుంబాల కథగా దీన్ని త్రివిక్రమ్ తయారుచేసాడని టాక్. ఆ కుటుంబాల మధ్య ఉన్న గొడవలను మహేష్ ఒక ప్రత్యేకమైన సంకల్పంతో అక్కడికి వచ్చి ఎలా ఆసమస్యను చక్కపెట్టాడు అన్నది ఈ మూవీ కథ అంటున్నారు.

ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చినప్పటికీ త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఈ కథలో చాలా వెరైటీగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ.మూవీలో యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. పల్లెటూరి వాతావరణంలో వచ్చే కథలను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారని త్రివిక్రమ్ అంచనా. ఈ టైటిల్ ఫిక్స్ చేయడంలో త్రివిక్రమ్ సెంటిమెంట్ కూడ బాగా ప్రభావితం చేసి ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ చాలా వరకు తన సినిమాలు అన్నింటికీ ‘అ’ అక్షరంతో మొదలయ్యే టైటిల్ పెట్టడం తన సక్సస్ ఫార్మలాగా మార్చుకున్నాడు. అయితే ఎక్కడా అమరావతి రాజధాని ప్రస్తావన లేకుండా కేవలం అమరావతి పేరును మాత్రమే దర్శకుడు ఈ మూవీలో చాలా తెలివిగా వాడుకున్నట్లు తెలుస్తోంది.