అనిల్ సినిమాకి బిగ్ రిస్క్ చేస్తున్న బాలయ్య.. తేడా కొట్టిందా “దబిడి దిబిడే”..!!

సినిమా ఇండస్ట్రీలో పలువు స్టార్ హీరోస్ ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు . పలానా తేదీన సినిమా రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని .. పుట్టినరోజు నాడు సినిమా అనౌన్స్ చేస్తే డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని భావిస్తూ ఉంటారు . మరికొందరు సినిమా టైటిల్స్ విషయంలో .. సినిమా పూజా కార్యక్రమం విషయంలో ఎక్కువగా మంచి ముహూర్తం.. ఫాలో అవుతూ ఉంటారు . అయితే టాలీవుడ్ లో నటసింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య కూడా ఇలాంటి కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు .

తన సినిమాలు సింహ , రెడ్డి అనే టైటిల్ తో వస్తే కచ్చితంగా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎప్పటి నుంచో బాలయ్య నమ్ముతూ వస్తున్నారు. అదే ఇప్పటివరకు ప్రూవ్ అయ్యింది కూడా . అంతేకాదు బాలయ్య ఏ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుంది . ఇప్పటివరకు చరిత్ర చెబుతున్న పాఠాలు కూడా అదే. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాకి మాత్రం బాలయ్య ఆ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేస్తున్నట్లు తెలుస్తుంది .

సింగిల్ రోల్ లోనే బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ టాక్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమా టైటిల్ ని కూడా చాలా క్యాచీ గా ఫన్నీగా పెట్టాలనుకుంటున్నారట . సింహా, రెడ్డి అనే టైటిల్ లేకుండానే ఫుల్ ఫన్నీ మూమెంట్లో ఈ సినిమా పేరును పెట్టాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారట . దానికి బాలయ్య కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం నందమూరి అభిమానులు కొంచెం ఇబ్బంది పడాల్సిన విషయమే అంటున్నారు సినీ విశ్లేషకులు . ఏమాత్రం సెంటిమెంట్ బ్రేక్ చేసిన బాలయ్య సినిమా రిజల్ట్ విషయంలో ఊహించని పరిణామం ఎదురుకోవాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి బాలయ్య ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

 

 

 

Share post:

Latest