బాల‌య్య కొత్త అడుగు.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్ కి పూన‌కాలు ఖాయం!?

నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ కు తగ్గట్టు ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు సినిమాలు, రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇటీవల హోస్ట్‌గా మారారు. అలాగే యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా మరో కొత్త అడుగు వేసేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

 

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` రెండు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్యతో నిర్మాత అల్లు అరవింద్ ఓ వెబ్ సిరీస్ చేయాలని ఆలోచన లో ఉన్నారట. ఇందులో భాగంగానే బాలయ్యతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా.. ఆయన ఓకే చెప్పార‌ట‌.

దీంతో ప్రస్తుతం బాలయ్య కోసం ఓ మంచి కథ ను తయారు చేయించే పనిలో అల్లు అరవింద్ ఉన్నాడ‌ని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కి పూన‌కాలు ఖాయమని అంటున్నారు. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే108` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.