దెబ్బకు దెబ్బ..ఎన్టీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిన యాంకర్ సుమ.. మామూలు ముదురు కాదురోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ అండ్..ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలు యాంకర్ గా దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుస్తుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తున్న పోతున్న సుమ పేరు జనాలు ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఆమె వాక్యాతుర్యం ..స్పాంటేనియస్ గా ఎలాంటి పంచ్ అయినా వేయడం ..హెల్తీగా అందరూ నవ్వుకునే విధంగా ఉండేలా మాట్లాడడం అంటూ జనాలు చెప్పుకొచ్చేవారు.

కాగా పలు ఈవెంట్స్ లో కూడా చకచకా గలగల నవ్వుతూ మాట్లాడిస్తుందని స్టార్స్ కూడా మెచ్చుకున్నారు . ఇదే క్రమంలో తాజాగా అమిగోస్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ సుమపై కోపంగా చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది . ఎన్టీఆర్ అప్పటికే ఫుల్ కోపంలో లో ఉన్నాడు. అదే టైంలో సుమ ..ఎన్ టీఆర్ 30 అప్డేట్ ఇవ్వబోతున్నాడు తారక్ అంటూ టంగ్ స్లిప్ అయ్యింది. సుమను కొట్టే అంత కోపంగా చూసాడు తారక్.. ఆ వీడియో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే . కాగా అప్పట్లో ప్రతి మీమర్ ఇవే పెట్టి సుమ గురించి తారక్ గురించి నానా రకాలుగా రాసుకొచ్చారు .

ఈ క్రమంలోనే తాజాగా వెంకటేష్ రానా కలిసి రానా నాయుడు అనే టైటిల్తో వెబ్ సిరీస్ చేశారు. మార్చి 10 నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ రానాలను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు . ఈ ఇంటర్వ్యూలో భాగంగా నెగిటివ్ షేడ్స్ ఉన్నా రోల్ చేస్తున్న వెంకటేష్ ని..సుమ ” నా వైపు కోపంగా చూడండి అంటూ కోరారు “. దీంతో వెంకటేష్ అలా సీరియస్ గా చూడగా..” ఈ మాత్రం చాలు రేపు అనేక థంబ్ నెయిల్స్ పుట్టుకొచ్చేస్తాయి . ఈమధ్య ఏంటో అందరు నన్ను ఇలాగే చూస్తున్నారు” అంటూ వ్యంగ్యంగా స్పందించింది .

దీంతో ఈ కౌంటర్ తారకే అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. సుమ ..ఎన్టీఆర్ ని ఏమీ అనలేక ఇలా పరోక్షంగా ఎన్టీఆర్ ను అనాలనుకున్న మాటలు ఇక్కడ అనేసిందని అభిప్రాయపడుతున్నారు . సుమ ఇన్నాళ్లకు కౌంటర్ ఇవ్వడంతో మరోసారి ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొందరు సుమ కి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు తారక్ ను సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు వీళ్ళ మధ్య మనకెందుకు అంటూ లైట్ గా తీసుకున్నారు..!!

Share post:

Latest