స‌రికొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న బ‌న్నీ.. త్వ‌ర‌లో బిగ్ అనౌన్స్‌మెంట్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. యాడ్స్ లో నటిస్తున్నాడు. అలాగే వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. ఇక‌ తాజాగా అల్లు అర్జున్ స‌రికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్నీ తొలిసారి హోస్ట్ గా మార‌బోతున్నార‌ట‌.

ప్రస్తుతం ఆహా ఓటీటీకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఇప్పటికే బాలకృష్ణ హోస్ట్ గా చేసిన‌ `అన్ స్టాపబుల్` టాక్ షో సూప‌ర్ స‌క్సెస్ అయింది. ఇప్పుడు మరో బిగ్ న్యూస్ చెప్పేసింది ఆహా. “ఇప్పటి వరకు మీరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మాస్ లుక్ లో, క్లాస్ లుక్ లో చూసి ఉంటారు. కానీ ఈ సారి బ్లాక్ బస్టర్ లుక్ లో మీ ముందుకు తీసుకురాబోతోంది ఆహా.. ‘ది బిగ్గెస్ట్’ అనౌన్స్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి!` అంటూ ట్వీట్ చేసిన ఆహా అల్లు అర్జున్‌ ఫొటోపై కమ్మింగ్ సూన్‌ అని రాసున్న ఓ పోస్టర్‌ను పంచుకుంది.

దీంతో బన్నీతో ఆహా ఏదో ప్రోగ్రామ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు స్ప‌ష్టం తేలిపోయింది. దీంతో ఆ కొత్త ప్రోగ్రామ్‌ ఎంటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ తరహా బ‌న్నీతో ఆహా వారు ఏదో టాక్‌ షో ప్లాన్‌ చేస్తున్నారని చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు. అదే నిజ‌మైతే బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవ‌డం ఖాయ‌మ‌వుతుంది.