మరో రెండు రోజుల్లో ఆస్కార్ వేడుక ..రాజమౌళికి కొత్త తలనొప్పి స్టార్ట్..ఇదేం లొల్లి సార్..!!

ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆత్రుతగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ఎప్పుడెప్పుడు కొడుతుందా అన్నంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ కు నామినేట్ అయింది . అంతేకాదు మరో రెండు రోజుల్లో ఆస్కార్ విన్నింగ్ లిస్ట్ ని ప్రకటించబోతున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిస్టులో ఆర్ఆర్ఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అంటూ తెలుగు జనాలు ..ఇండియన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

ఈ క్రమంలోనే అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు ఆరారార్ టీం. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా మొత్తం ఆరారార్టీం మొత్తం ఇప్పుడు అమెరికా చేరుకుంది . రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ సైతం అమెరికా చేరుకున్నారు. కాగా ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కొట్టకముందే మెగా – నందమూరి ఫ్యాన్స్ కొట్టుకు చస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతుంది.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అంటూ చరణ్ ఫ్యాన్స్ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ ‘టాక్ ఈజీ విత్ సామ్ ప్రాగోసో’ షోలో పాల్గొన్నారు. షోలో హోస్ట్ ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అని పిలిచినట్లు ఎగతాళి చేస్తూ ఉన్న్ వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోని దానికి కౌంటర్ గా నందమూరి ఫ్యాన్స్ .. ఒరిజినల్ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు .నిజానికి ఆ షోలో హోస్ట్ ఎన్టీఆర్ ని సైడ్ క్యారెక్టర్ అని అనలేదు. చరణ్ తో పాటు నటించినా అలలాంగ్ సైడ్ క్యారెక్టర్ నటుడు అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు..వీడియో ని ఎడిట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ని సైడ్ క్యారెక్టర్ గా మార్చేశారు.

దీని పై నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అవ్వడానికి మెయిన్ కారణం తారక్ నటనే అంటూ ఎన్టీఆర్ ని ఓ రెంజ్ లో పోగిడేస్తున్నారు . ఇదే క్రమంలో మెగా ఫాన్స్ చరణ్ ని పొగుడుతున్నారు . దీనితో రాజమౌళికి పెద్ద తలనొప్పిగా మారింది . ఆస్కార్ అవార్డు కొట్టినా.. ఇలా ఫ్యాన్స్ కొట్టుకు చస్తారేమో ..అంటూ భయపడుతున్నారట . దీంతో రాజమౌళికి కొత్త సమస్య వచ్చినట్లు అయింది . చూద్దాం ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుందో..?

 

 

Share post:

Latest