మీరు చూసింది కాంతారా 2.. త్వరలోనే కాంతారా 1 .. మైండ్ బ్లోయింగ్ ట్వీస్ట్ ఇచ్చిన రిషిబ్..!!

కాంతారా.. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే . కన్నడ డైరెక్టర్ రిషిబ్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది . సుమారు 17 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద 470 కోట్లు కలెక్ట్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది .

రీసెంట్గా వంద రోజులు పూర్తి చేసుకున్న సంధర్భంగా గ్రాండ్ గా ఫంక్షన్ కూడా చేసారు మేకర్స్. అయితే ఇందులో భాగంగా రిషిబ్ శెట్టి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు . ఈ క్రమంలోని త్వరలోనే రాబోతున్న కాంతారా 2 పై సంచలన కామెంట్స్ చేశారు . రిషిప్ శెట్టి మాట్లాడుతూ..” కాంతార సినిమా ఇంత పెద్ద విజయం అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది . సినిమాను ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు . ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ సినిమా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది.”

“మీరందరూ అనుకుంటున్నట్లు త్వరలో రాబోయేది కాంతారా 2 కాదు కాంతారా 1 ఇప్పటివరకు మీరు చూస్తుంది అంతా కాంతారా పార్ట్ 2 దీనికి అనుగుణంగానే పార్ట్-1 తీయ్యబోతున్నాం. ఈ ప్రీక్వల్ ఆలోచన మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడే వచ్చింది. ఎందుకంటే మూవీ చరిత్ర చాలా లోతైనది ..కాంతారా 2 కన్నా పార్ట్ 1 అందరికీ ఎక్కువగా నచ్చుతుంది ..కథ కోసం ఇంకా డెప్త్ గా ఈ సినిమాను చూస్తారు.. ఇంతకన్నా ఇప్పుడు నేను ఏం చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే కాంతారా కి సీక్వల్ కాదు ప్రీక్వెల్ అంటూ రిషిబ్ శెట్టి ఓపెన్ గానే చెప్పేసాడు . దీంతో కాంతారా పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు..!!