బాలకృష్ణ లో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి… మరోసారి ఇరగదీసాడుగా..!

నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని అంతా అనుకుంటున్నా సమయంలో ఎవరూ ఊహించని విధంగా నూతన ఉత్తేజంతో జూలు విదిల్చిన సింహంలా ఒక్కసారిగా పంజా విసిరాడు. అప్పటి వరకు ఆయన తీస్తున్న ప్రతి సినిమా ప్లాప్‌ అవుతుంది. ఇక తన తండ్రి పేరుతో తీసిన రెండు బయోపిక్ లు కూడా ఘోరమైన డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. అయినా కూడా అలుపెరుగని పోరాటం చూస్తున్న బాలయ్య బాబుకి అఖండ సినిమాతో తన బలాన్ని మళ్లీ చూపించాడు. ఆ సినిమాతో వచ్చిన ఎనర్జీతో ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో వచ్చి తన కెరీర్ లోని హైయెస్ట్ కలెక్షన్ అందుకున్నాడు.

 నందమూరి బాలకృష్ణ తాజాగా వేగ జ్యువెలర్స్‌కు ఓకే చెప్పారు. దానికి సంబంధించిన యాడ్‌కు పోస్టర్‌ విడుదల చేశారు. ఈ యాడ్‌లో పంచెకట్టులో బాలయ్య లుక్ అదరగొట్టేసారు. ఈ యాడ్ త్వరలో ప్రసారం కానుంది. (Twitter/Photo)

ఇక ఇప్పుడు ఈ దోవలోనే ఓటీటీలో ఆన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులకు తనలోని కొత్త బాలయ్యను పరిచయం చేశాడు. ఇప్ప‌టీకే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా చివరి దశలో ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా మారింది. ఈ సమయంలోనే బాలయ్య మారో అడుగు ముందుకు వేసి పెరుగుతున్న తన ఇమేజ్‌కు అనుగుణంగా కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారాడు. ఇప్పటికే త‌న తోటి హీరోలు చిరు, నాగ్, వెంకటేష్‌లు కమర్షియల్ యాడ్స్ చేస్తూనే ఉన్నారు. ఇపుడు అదే రూట్లో బాలయ్య కమర్షియల్ యాడ్స్‌లో ఏ మేరకు ఇరగదీస్తాడనేది సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Balakrishna daughter becomes producer

మొన్న ఆమధ్య సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కు ఓ కమర్షియల్ యాడ్ చేయగా, ఇప్పుడు మళ్లీ వేగ జువెలరీస్‌ కోసం మరో కొత్త యాడ్‌లో నటించాడు. ఈ యాడ్‌లో నటించడానకీ కారణం బాలయ్య చిన్న కూతురు తేజస్వి అని చెబుతున్నారు. ఆమె కన్విన్స్ చేయడంతో ఈయన ఈ యాడ్స్‌లో నటించడానికి బాలయ్య ఓకే చెప్పారు. మరి రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ కి బాలకృష్ణ యాడ్స్ చేసిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.