అల్లు అర్జున్‌తో పోటీపడి పరువు తీసుకున్న బాలీవుడ్ హీరో..!

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగులు, అలాగే అల్లు అర్జున్ యాక్షన్ బాగా హైలెట్ అయింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్‌ హిట్‌కు రీమేక్‌ చేసి చేతులు కాల్చుకున్నాడు బాలీవుడ్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌. అల వైకుంఠపురములో మూవీకి ‘షెహజాదా’గా బాలీవుడ్‌ రీమేక్ చేయగా అందులోని కార్తిక్‌ ఆర్యన్‌ పెర్ఫార్మన్స్‌ను బన్నీ యాక్షన్‌తో పోల్చుతున్నారు.

రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌ను కూడా వారు కంపేర్ చేస్తున్నారు. కాగా వారి నుంచి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌ చాలా పూర్ అని కొందరు అంటుంటే.. బన్నీ రోల్‌కు కార్తిక్‌ కొంచెం కూడా న్యాయం చేయలేకపోయాడని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎక్కడ, ఈ నటుడు ఎక్కడ, బన్నీలో ఉన్న గ్రేస్ ఇతడిలో అసలే లేదు, ఒరిజినల్ సినిమా చూసిన వారు ఈ రీమేక్ చూస్తే డిసప్పాయింట్ కావడం పక్కా అని అంటున్నారు.

ఒరిజినల్ సినిమాకి తమన్ సగం బలం అయితే.. హిందీ రీమేక్ సినిమాకి ప్రితమ్‌ అందులో పావు వంతు కూడా కాలం కాలేకపోయాడని మ్యూజిక్ లవర్స్ పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద ఈ రీమేక్ బెడిసి కొట్టిందని చెప్పాలి. సినిమా మేకింగ్ పరంగా మాత్రమే కాదు కలెక్షన్‌లలోనూ షెహజాదా చాలా వెనుకబడింది. షెహజాదా ఫస్ట్ డే రూ.6 కోట్లు కలెక్ట్ చేస్తే అలవైకుంఠపురములో మూవీ రూ.30 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇలా ఒరిజినల్‌కు ఒక పేరడీలా ఇది తయారైంది.