ఇట్స్ అఫీషియ‌ల్‌.. `వారసుడు` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌!

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగిన చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న త‌మిళంలో. జనవరి 14న తెలుగులో విడుదలైంది.

తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ మాత్ర‌మే ద‌క్కింది. అయితే పండగ అడ్వాంటేజ్ తో భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. `వారసుడు` ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది.

ఫిబ్ర‌వ‌రి 22 నుంచి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. “ఇక సిద్ధంగా ఉండండి.. ఎదురు చూపులు ముగిశాయి. అతను ఇక్కడికి రాబోతున్నాడు. ఫిబ్రవరి 22న వారుసుడు తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో వచ్చేస్తోంది“ అంటూ అమెజాన్ ప్రైమ్ వారు పేర్కొన్నారు.

Share post:

Latest