ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇదే…!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోలైన నటరత్న ఎన్టీఆర్ , సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమంలో ఎన్నో సంవత్సరంలో తమ సినిమాలతో పోటీపడ్డారు. ఈ ఇద్దరు హీరోలు ముందుగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ఎన్టీఆర్. అయితే నిజానికి కృష్ణ హీరోగా వచ్చిన తన 200వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎదగడానికి పరోక్షంగా ఉపయోగపడిందని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ రాజకీయాలలో ముందుకు వెళ్లిన సందర్భంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ కృష్ణ కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. ఈ తరుణంలోనే 1984లో ఇందిరాగాంధీ హఠాత్ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం ప్రధాని అవటం తెలుగు రాజకీయాల్లో ఎన్నో అనూహ్యమైన మార్పులు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ ను రాజకీయాల్లోకి రావాలని ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు.

ఇద్దరికీ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వైరం... ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా  కృష్ణ తీసిన సినిమాలు ఇవే!

ఆ సమయంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని కృష్ణను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించడంతో కృష్ణ హీరోగా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వచ్చిన తొలి సినిమా సింహాసనం. ఇక ఇందులో రాజ గురువు సత్యనారాయణ చేత ఓ డైలాగ్‌ చెప్పించారు. ఇక అధి గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడారు. నా దగ్గరేముంది బూడిద అనే డైలాగ్. ఈ సినిమా తర్వాత నా పిలుపే ప్రభంజనం అనే సినిమాలో ఎన్టీఆర్‌ను పోలి ఉన్న పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ను దాసరి నారాయణతో రాయించారు.

ఇద్దరికీ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వైరం... ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా  కృష్ణ తీసిన సినిమాలు ఇవే!

ఈ సినిమాల గురించి ముందే గమనించిన ఎన్టీఆర్ ఎవరు కూడా ఆందోళన చేయవద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సినిమాల తర్వాత ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మండలాధీశుడు సినిమాతో కృష్ణ ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను పోలి ఉన్న పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించగా.. సీనియర్ నటి భానుమతి కూడా ఓ కీలక పాత్రలో నటించిడం అప్పుడు ఎంతో పెను దుమారం రేపింది.

krishna political career : రాజకీయ "సింహాసనం " పై! - Tolivelugu తొలివెలుగు

ఈ సినిమాలో ముందుగా కృష్ణ ఎంట్రీతో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో నటించినందుకు కోటాకు రెండేళ్ల పాటు సినిమాల్లో ఛాన్సులు ఇవ్వలేదు. ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ తీశారు కృష్ణ. ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో గండిపేట రహస్యం అనే మరో సెటైరికల్ సినిమా కూడా వచ్చింది. ఈ విధంగా ఆ సమయంలో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు ఎంతో సంచలంగా మారాయి.

Share post:

Latest