టాలీవుడ్‌కు ప్రతిరోజు ఎంతోమంది కొత్త ముద్దుగుమ్మలు వస్తూ ఉంటారు.. పోతుంటారు. వారిలో కొంతమంది మాత్రమే నిలబడి స్టార్ హీరోయిన్లు గా మారతారు. హీరోల కన్నా హీరోయిన్ల మధ్య గట్టి పోటీ నడుస్తూ ఉంటుంది. సీనియర్ భామల్ని తట్టుకుని కొత్త వారు నిలబడటం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. తాజాగా ఇప్పుడు టాలీవుడ్‌కు ఒకేే నెలలో ముగ్గురు అందమైన భామలు ఎంట్రీ ఇచ్చారు.
వారు నటించిన మూడు కూడా మీడియం బడ్జెట్ సినిమాలు కావడంతో.. ఈ ముద్దుగుమ్మలపై ఫోకస్ చేసేలా చేశాయి. ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ తొలి సినిమా మాత్రం వాళ్ళకి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుట్ట బొమ్మ సినిమాతో అనిఖ సురేంద్రన్ హీరోయిన్గా పరిచయమైంది. తన యాక్టింగ్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న సినిమా పాప్ల్ అవటంతో ఈ అమ్మడి కష్టం మొత్తం వృధా అయ్యింది.
ఇక మళ్ళీ ఇదే నెల 10న కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమీగోస్ సినిమాతో అషికా రంగనాథ్ హీరోయిన్గా పరిచయమైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. విడుదలకు ముందు అమిగోస్ ప్రమోషన్లతో హైప్ వచ్చిన సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇక అషికా రంగనాథ్ ఒక తన గ్లామర్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాబోయే రోజులు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
ఇక ఈనెల 18న శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో గౌరీ కిషన్ హీరోయిన్ గా పరిచయమైంది. చబ్బీ క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. దీంతో గౌరీ కిషన్ టాలీవుడ్ కి వెల్ నోన్ అమ్మాయిలా ఫోకస్ అయింది. మరి బ్యూటీ చేతిలో కొత్త అవకాశాలు ఏవైనా ఉన్నాయా? అన్నది చూడాలి. ఆ రకంగా ముగ్గురు భామలకి ఎద అందలు ఎంత పెద్ద ఉండి గ్లామర్ ఉన్నప్పటికీ కూడా కాలం కలిసి రాలేదని చెప్పాలి.