ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సింహాద్రి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైర‌క్ష‌న్‌లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్, రాజమౌళి స్టార్‌ డైరెక్టర్ గా మారాడు. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఇంత పెద్ద ఇండస్ట్రీ హీట్ అయినా ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ హీరో కాదట, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన ఈ స్టోరీని ముందుగా బాలకృష్ణకి చెప్పారట. ఆ సమయానికి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి పవర్ ఫుల్ సినిమాలు చేసిన బాలయ్య ఈ స్టోరీకి నో చెప్పారట.

సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే.. | Prabhas Balakrishna  Missed Ntr Rajamouli Simhadri Movie Details, Balakrishna ,prabhas, Simhadri  Movie, Director Rajamouli,junior Ntr, Ntr Simhadri Movie, Ntr ...

ఆ తర్వాత రాజమౌళి ఇదే స్టోరీని ప్రభాస్ కి చెప్పగా.. ప్రభాస్ ఈ స్టోరీ విని కొంత టైమ్‌ కావాలని అడిగాడట, దాంతో కొంత సమయం వెయిట్ చేసిన రాజమౌళి ఎంత సమయం గడుస్తున్న ప్రభాస్ నుంచి సమాధానం రాకపోవడంతో.. తన తండ్రి సూచనతో ఎన్టీఆర్ కి ఈ స్టోరీ చెప్పి ఆయనతో ఈ సినిమా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టాడు. తర్వాత ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో ఛ‌త్రపతి, బాహుబలి సినిమాలు వచ్చాయి. కానీ సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ ఇప్పటికీ చాలా బాధపడుతున్నాడట.

సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే.. | Prabhas Balakrishna  Missed Ntr Rajamouli Simhadri Movie Details, Balakrishna ,prabhas, Simhadri  Movie, Director Rajamouli,junior Ntr, Ntr Simhadri Movie, Ntr ...

ఇక సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ కి నంద‌మూరి అభిమానులో విపరీతమైన క్రేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా ద‌గ్గ‌ర నుంచే ఎన్టీఆర్‌ను నంద‌మూరి కుటుంబం ద‌గ్గ‌ర‌కు తిసుకుంది అని కూడా అంటారు. అప్ప‌టి నుంచే మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు. ఇక రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చి అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడం లో ముఖ్య పాత్ర రాజమౌళి అనే చెప్పాలి.

Share post:

Latest