బ్రేకింగ్ : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..హాస్పిటల్ కి తరలింపు..!!

మనకు తెలిసిందే.. టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తుది శ్వాస ను విడిచారు. గత 23 రోజులుగా మరణానితో పోరాటం చేసిన ..తారకరత్న ఓడిపోయారు. నిన్న రాత్రి 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. నందమూరి తారక రత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు .

మరీ ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు . టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఆమెను ఎంత ఓదారుస్తున్న ఆమె.. తన భర్త పార్ధివ దేహం వద్ద కుమిలి కుమిలి ఏదుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తుంది . తారకరత్న కి హార్ట్ ఎటాక్ వచ్చినప్పటి నుంచి ఆమె హాస్పిటల్ లో దగ్గరుండి చూసుకుంటుందట.

కంటి మీద కును లేకుండా భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందట . ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదని ..ఈ క్రమంలోనే ఆమె నిన్న నైట్ నుంచి వాటర్ కూడా తీసుకోకపోవడంతో స్పృహ తప్పి పడిపోయిందని తెలుస్తుంది . అంతేకాదు అలేఖ్య రెడ్డి ఏడుస్తున్న దృశ్యాలను చూసిన ప్రతి మనిషి చలించి పోతున్నాడు. దేవుడు ఇంత దుర్మార్గుడా ఇలాంటి మంచి మనిషిని త్వరగా తీసుకెళ్లి పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ..అంటూ దేవుడి పైన మండిపడుతున్నారు . ఆమె ఇలా అధైర్య పడిపోకూడదని..తన బిడ్డలను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు .

Share post:

Latest