ఒకే వేదిక‌పై స్టార్ హీరోలు…బాల‌య్య బాబు ఎందుకు మిస్ అయ్యాడు…!

స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం అనేది ఎంతో అరుదుగా జరిగే సంఘటన. అభిమానులందరూ తమకు ఇష్టమైన హీరోలందరినీ కలిసి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

సీనియర్ స్టార్ హీరోలు ఆ విషయంలో మారిపోయారా.. ఆ మార్పు మంచికేనా | Tollywood  Senior Heroes Movie Updates, Balakrishna, Chiranjeevi, Venkatesh,  Nagarjuna, Tollywood Senior Heroes - Telugu Balakrishna ...

సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలతో పోటీ పడుతూ.. తమ సత్తా చాటుతున్నారు. వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నా ఈ నలుగురు సీనియర్ హీరోలు కలిసి ఉన్న ఫోటోలు చాలా అరుదు. తాజాగా అలాంటి అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chiranjeevi

ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఒక్క బాలకృష్ణ తప్పించి మిగిలిన ముగ్గురు సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో పాటు రాజశేఖర్, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. ఇంతకు ఈ ఫోటో ఎక్కడిది అంటే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా సూపర్ హిట్ అవడంతో వందరోజుల ఫంక్షన్ నిర్వహించారు.

ఆ ఫంక్షన్‌కు వెంకటేష్, నాగార్జున, కృష్ణ, రాజశేఖర్ ముఖ్య అతిథులుగా వచ్చారు. వీరితోపాటు అప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ఇక ఈ రేర్ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో బాల‌య్య కూడా ఉండి ఉంటే అద్భుత‌మైన మూమెంట్ అయ్యి ఉండేది.

Share post:

Latest