స్టేజీ పైనే రప్ఫాడించిన స్టార్ హీరో భార్య .. జ్యోతికలో ఈ టాలెంట్ కూడా ఉందా (వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మంచు గడ్డలో షాట్ర్ట్ చేస్తేనే రెండు రోజులు రెస్ట్ తీసుకుంటూ .. డైరెక్టర్స్ ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కాలు కింద పెట్టకుండా సినిమా షూటింగ్ లని చేస్తూ వయ్యారాలను వలకబోస్తున్నారు . అయితే రీసెంట్గా తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జ్యోతిక నగ్మా చెల్లెలు అన్న విషయం అందరికీ తెలిసిందే . అక్క పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక తెలుగు తమిళ భాషలలో హీరోయిన్గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది . మరీ ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చిరంజీవితో జతకట్టి తెలుగు జనాలకు మరింత చేరువైంది . ఇక సినిమాలో చేస్తున్న టైంలోనే సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది . పెళ్లి – పిల్లలు తర్వాత ఇప్పుడిప్పుడే కెరియర్ ను ముందుకు తీసుకెళ్తూ దూసుకెళ్తుంది.

లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాగా రీసెంట్గా జ్యోతికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఏదైనా స్ట్రన్స్ లాంటివి చేయాలి అంటే కచ్చితంగా హీరోలకే ఇస్తారు డైరెక్టర్లు . ఎందుకంటే ఫిజిక్ పరంగా వాళ్ళే స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది వాళ్లకి. అయితే అది తప్పు అంటూ ప్రూవ్ చేసింది జ్యోతిక. 2020 లో JFW మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైనే లైవ్లో స్టాంట్ చేసి చూపించింది జ్యోతిక .

అది కూడా చీరకట్టులో ఉన్నప్పుడు వేలాదిమంది చూస్తుండగా ఏమాత్రం భయం లేకుండా.. ధైర్యంగా కాన్ఫిడెంట్ గా కర్ర సాము చేసి పర్ఫెక్ట్ హీరోయిన్ అని అనిపించింది. ఇదే వీడియోని తాజాగా మరోసారి ఇన్స్టాల్ లో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ గా మారింది . ఇది చూసిన జనాలు జ్యోతిక డెర్నెస్ కి ఫిదా అయిపోతున్నారు. నేటి కాలంలో చడ్డీలు మిడ్డీలు వేసుకునే హీరోయిన్స్ ఇలాంటివి చూసి పద్ధతిగా చీర కట్టుకొని అయినా సరే స్టంట్స్ చేయడం నేర్చుకుంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఒక్క వీడియోతో జ్యోతిక మరోసారి పాపులారిటీ సంపాదించుకుంది . ప్రజెంట్ జ్యోతిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by JFW Binge (@jfwbinge)

 

Share post:

Latest