“అది వాళ్ళు పెట్టిన భిక్షే”… పెద్దారెడ్డి చేపల పులుసు సీక్రేట్ లీక్ చేసిన రాకింగ్ రాకేష్..!!

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్ ..కిర్రాక్ ఆర్పి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే . కాగా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో ఒకరే ఈ కిర్రాక్ అర్పి . తనదైన స్టైల్ లో కామెడీ పంచెస్ వేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పి ఎవరు ఊహించిన విధంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసాడు . ఇదే క్రమంలో రీసెంట్గా జబర్దస్త్ పై కిర్రాక్ ఆర్పి సంచలన కామెంట్స్ చేశాడు .

మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ స్కిట్స్ వేసిన వాళ్ళకి డబ్బులు సరిగ్గా ఇవ్వదని.. స్కిట్స్ వేయించుకొని చాలా టార్చర్ చేస్తుందని ..ఘాటుగా స్పందించాడు. ఇదే క్రమంలో ఆయన పై పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కిరాక్ ఆర్పి రీసెంట్గా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ హైదరాబాద్లో ఒక కర్రీస్ పాయింట్ ని స్టార్ట్ చేశారు . ఎవరు ఊహించిన విధంగా .. ఈ కర్రీ పాయింట్ బిజినెస్ సూపర్ సక్సెస్ అయింది . పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి . ఈ క్రమంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పై పలు రకాల బ్యాడ్ కామెంట్స్ వినిపించగా .. దాన్ని తిప్పికొడుతూ కిరాక్ ఆర్పి డేరింగ్ కామెంట్స్ చేశారు.

కాగా రీసెంట్ గా మరో జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పి పై సంచలన కామెంట్స్ చేశారు. హోస్ట్ ప్రశ్నిస్తూ ” నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సక్సెస్ అవ్వడానికి కారణం జబర్దస్త్ అంటారా..?” అంటూ సూటిగా అడిగాడు..రాకేష్ “ఎవరు చేసిన అది జబర్దస్త్ పుణ్యమే.. అది మల్లెమాల బిక్షే” అని ఓపెన్ గా చెప్పేసాడు.

అంతే కాదు “ఈ మధ్యకాలంలో మీరు ఆర్పిని కలిసారా..?” అని అడగ్గా ” మాకు అంత అదృష్టం లేదు.. వాళ్ళేదో పెద్ద వాళ్ళు మేము చిన్న ఆర్టిస్టులమంటూ “వ్యంగ్యంగా స్పందించారు . ఇలానే హోస్ట్ అడిగిన ప్రశ్నలకు వ్యంగ్యంగా స్పందిస్తూ ఘాటుగా కౌంటర్స్ వేశారు రాకేష్. మొత్తానికి కిర్రాక్ ఆర్పి – రాకింగ్ రాకేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మాటలు యుద్ధం జరుగుతుంది . చూడాలి మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో ..ఎప్పుడు ఎండ్ అవుతుందో..?

 

Share post:

Latest