ఓరి దేవుడోయ్..ఆఖరికి వాళ్లతో కూడానా.. కొరియన్ యాక్టర్స్ తో చేతులు కలిపిన రష్మిక మందన్నా.. ఎందుకో తెలుసా..?

తన సినిమాలతో ..తన బిహేవియర్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైయే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. రీసెంట్గా కొరియన్ స్టార్ హీరోస్ తో ఫొటోస్ దిగింది . వాళ్ళతో కలిసి డాన్స్ లు ఏస్తూ చిందులేస్తుంది . దీనికి సంబంధించిన ఫొటోస్.. విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్రమంలోనే మరోసారి రష్మిక మందనాన్ని ఏకీపారేస్తున్నారు జనాలు .

మనకు తెలిసిందే పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన .. రీసెంట్గా వారసుడు సినిమాతో పాజిటివ్ హిట్ అందుకుంది . సినిమా హిట్ అయిన అమ్మడు క్యారెక్టర్ ఫట్ అంటూ జనాలు ఏకిపారేశారు . అంతేకాదు ఆమె బాలీవుడ్ లో ఎన్నో ఆశలతో నటించినా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి . ఈ క్రమంలోనే బాలీవుడ్ కి రష్మిక పనికిరాదు అన్న కామెంట్లు వినిపించాయి . దీంతో కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన రష్మిక.. తనపై ఉన్న నెగెటివిటీని పాజిటివిటీగా మార్చుకునేందుకు ఫోటోషూట్లతో పలు ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ జనాల్లో క్రేజ్ సంపాదించుకుంటుంది .

ఈ క్రమంలోనే విదేశాలలో కూడా తన హవా కొనసాగించింది. తాజాగా ఇటలీలో మిలన్ ఫ్యాషన్ వీక్ జరగక అక్కడ కూడా రష్మిక మందన హైలైట్ గా నిలిచింది. ఈవెంట్ కి దేశ విదేశాల నుంచి చాలామంది స్టార్స్ పాపులర్ సెలబ్రెటీస్ అటెండ్ అవుతూ ఉంటారు . అలా రష్మిక మందన కూడా ఈవెంట్ కు అటెండ్ అయి అదరహో అనిపించింది. అయితే ఇదే ఫ్యాషన్ వీక్ కు దక్షిణ కొరియా నటుడు జంగ్ ఊ, థాయిలాండ్ నటుడు గల్ఫ్ కానవత్ వచ్చారు. ఇప్పుడు వీళ్లతో కలిసి రష్మిక ఫొటోలు దిగడమే కాకుండా పాటలకు స్టెప్పులు కూడా వేసింది. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

అయితే కొందరు ఆకుతాయి రష్మికను ఏడిపిస్తున్నారు . నీ ఫేస్ కి ఆ కొరియన్ ఫేస్ కి బాగా సెట్ అయింది ..వాళ్ళతో కలిసి మా తెలుగు జనాలను వదిలేసేయ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు నీకు వాళ్ళకి బాగా కుదిరింది ..నీ మొఖం వాళ్లకి బాగా సెట్ అవుతుంది ట్రై చెయ్ ..అంటూ ఆమెకు సజీషన్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే త్వరలోనే కొరియన్ భాషలో రష్మిక మందన నటించిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు . చూద్దాం రానున్న రోజుల్లో రష్మిక ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తుందో..?

 

Share post:

Latest