ఆ విష‌యంలో రామ్ చ‌ర‌ణే తోపు.. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌ల‌ను కూడా తొక్కేశాడు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు.

అలాగే మరికొన్ని పాన్‌ ఇండియా ప్రాజెక్టులను సైతం లైన్ లో పెట్టాడు. ఇక‌పోతే సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో రామ్ చరణ్ ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 12 మిలియన్లకు చేరుకుంది. ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్‌ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలు తొక్కేసి చ‌ర‌ణ్ తానే తోపు అనిపించుకున్నాడు.

దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. కాగా, హీరోలకి 12 మిలియన్ ఫాలోవర్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇప్పటి వరకు సౌత్ నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో ఇద్దరు హీరోలు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో 19.9 మిలియన్ ఫాలోవ‌ర్స్ తో అల్లు అర్జున్ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉండ‌గా.. రెండో స్థానంలో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ 17.8 మిలియన్‌ ఫాలోవర్స్ తో ఉన్నాడు. ఇక ఇప్పుడు మూడో స్థానంలో 12 మిలియన్స్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ నిలవడం విశేషం.