“వాళ్ళు అంతే..చిన్న దాన్ని పెద్దగా చేస్తారు”..రకుల్ నోట ఇలాంటి మాటలా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రజెంట్ బాలీవుడ్లో బడా బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది .

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ రకుల్ పై నానా విధాలుగా జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు . ఓసారి డ్రెస్ విషయంలో మరోసారి సినిమాల విషయంలో ..మరోసారి బాయ్ ఫ్రెండ్ విషయంలో ..ఇలా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ని ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యుల్లో రకుల్ ప్రీత్ సింగ్ సంచలన కామెంట్స్ చేసింది.

“సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూస్తున్నారు. అది చాలా తప్పు అంటూ “వ్యాఖ్యానించింది . “సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసి చూస్తున్నారు ..చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి వివాదంగా మారుస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా కామన్ గా మారిపోయింది . ఈ విషయాన్ని జనాలు లైట్గా తీసుకుంటే బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు “హిందీ తెలుగు అనే తేడాలపై ఆమె రియాక్ట్ అవుతూ… హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండు వేరు వేరు కాదని.. రెండు ఒకటే అని అసలు అన్ని ఇండియన్ సినిమాలే ” అంటూ స్ట్రాంగ్ గా నొక్కి చెప్పింది . ఈ క్రమంలోని రకుల్ ప్రీతిసింగ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ట్రోలర్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. నీ నోట ఇలాంటి మాటలా..? అంటూ ఎగతాళి చేస్తున్నారు..!!

Share post:

Latest