టైం చూసి కొట్టిన జక్కన్న..”RRR” విషయంలో మైండ్ బ్లోయింగ్ నిర్ణయం..!!

ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . “రణం రౌద్రం రుధిరం” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం మార్చి 25న విడుదలైంది . దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సుమారు దాదాపు 500 కోట్ల భారీ వ్యయంతో డి వి వి దానయ్య నిర్మించారు. కాగా సుమారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1300 కోట్లకు పైగా రాబడినట్లు తెలుస్తుంది .

టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు తారక్-చరణ్ కలిసి నటించడం ఈ సినిమాకే హైలైట్ గా మారింది . కాగా ప్రజెంట్ హాలీవుడ్ స్థాయిలో హంగామా చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి సైతం నామినేట్ అయింది . కచ్చితంగా ఆస్కారను కూడా సాధించుకుంటుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇండియన్స్. ఈ క్రమంలోనే రాజమౌళి మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్స్ రీ రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు.

మార్చి మూడవ తేదీన దాదాపు 200 థియేటర్లకు పైగానే ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కొడితే కచ్చితంగా రాజమౌళి ఆరారార్ 2 ను తెరకెక్కిస్తారట. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొడితే స్టేజ్ పైనే ఆర్ఆర్ఆర్ 2 అనౌన్స్మెంట్ ఇచ్చే విధంగా రాజమౌళి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది నిజంగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఆర్ఆర్ఆర్ తోనే సంచలన రికార్డు నెలకొల్పిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ 2 తో ఇండియన్ ఇండస్ట్రీసినిమా రికార్డును తిరగ రాస్తాడు అనడంలో సందేహం లేదు అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరగబోతుందో..?

Share post:

Latest