విడుద‌ల‌కు ముందే నాని `ద‌స‌రా`కు లాభాలు.. ఇదేం క్రేజ్ రా సామి!?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో దాదాపు రూ. 65 కోట్ల బ‌డ్జెట్ తో మాస్ య‌క్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీని రూపొందించారు. ఇందులో నాని మున్నెప్పుడూ చూడ‌ని ఊర‌మాస్ లుక్ లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు.

ఇక‌పోతే విడుద‌ల‌కు ముందే ద‌స‌రాకు లాభాలు వ‌చ్చిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ రైట్స్‌ను బ‌డా నిర్మాత దిల్‌రాజు రూ. 29 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. అలాగే ద‌స‌ర అన్ని భాష‌ల డిజిట‌ల్ రైట్స్ రూ. 48 కోట్ల‌కు అమ్ముడు పోయాయ‌ట‌. ఇక శాటిలైట్ రైట్స్ తో పాటు ఓవ‌ర్‌సీస్ రైట్స్ ద్వారా నిర్మాత‌ల‌కు భారీ లాభాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.