ఏంటి..నందమూరి బాలయ్య అంత చీప్ గా కనిపిస్తున్నాడా..? కీ పాయింట్ తో దూల తీర్చేస్తున్న ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నారా ..? అంటే అవుననే చెప్పాలి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యులతో పాటు స్టార్స్ కూడా హద్దులు మీరి పోతున్నారు . హద్దులు మీరికంటెంట్ ఇవ్వడంతోనే సామాన్య జనాలు హద్దులు మీరి ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఇలాంటివి ఎన్నో విషయాలు మనం చదివాం ..విన్నం. కాగా రీసెంట్గా మరో మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటి ప్రకాష్ రాజ్ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో బాలయ్య ను ట్రోల్ చేస్తున్న వీడియో ని లైక్ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మనకు తెలిసిందే నందమూరి బాలయ్య అభిమానుల కోసం ఎలాంటి రోల్స్ నైనా చేస్తాడు . ఈ క్రమంలోనే గతంలో రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన పాండురంగడు సినిమాలో కూసింత హద్దులు మీరి నటించారు. ఈ సీన్స్ సినిమాలో వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా ..సినిమా అంటే అన్ని రసాలు ఉండాలని జనాలు కూడా లైట్ గా తీసుకున్నారు . కాగా పాండురంగడు మూవీలో భక్తి రసం కంటే శృంగార రసం ఎక్కువైందన్న కామెంట్లు వినిపించాయి .

ఈ మూవీలో వేశ్య (టబు) మాయలో పడిన బాలయ్య తన భార్య(స్నేహ)ను దూరం పెడతాడు . సినిమాలో రాఘవేంద్రరావు తన మార్క్ రొమాంటిక్ సాంగ్ ని టూ హాట్ గా తెరకెక్కించాడు . ఆ సాంగ్ లో బాలయ్యతో బత్తాయిలు పిండించడం నుండి దారుణమైన పనులు కూడా చేయించారు . అంతేకాదు కొలనులో మునుగుతున్న టబును బాలయ్య సింగిల్ ఫింగర్ తో ఎత్తడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో రాఘవేంద్రరావు క్రియేటివిటీ వేరే లెవెల్ అనే చెప్పాలి .

కాగా ఆ సాంగ్ ని ట్రోల్ చేస్తూ తమిళ్ తంబిలు ఎడిట్ వీడియోని షేర్ చేశారు . ఆ వీడియోని ప్రకాష్ రాజ్ లైక్ చేశాడు . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ చిన్న లైక్ తో బాలయ్య అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాడు ప్రకాష్ రాజ్. ఈ విధంగా ఉన్న ట్రోలింగ్ వీడియోను ప్రకాష్ రాజు లైక్ చేయడం బాలయ్య ను ఇన్సల్ట్ చేశాడు అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నాడు . మా బాలయ్య నీకు అంత చీప్ గా కనిపిస్తున్నాడా అంటూ బూతులు తిడుతున్నారు. దీని పై ప్రకాష్ రాజు వివరణ ఇవ్వకుండా ఉంటే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

 

Share post:

Latest