ఎన్టీఆర్ 32వ సినిమా రేసులో ఇంత‌మంది డైరెక్ట‌ర్లా… ఇదేం లిస్టురా బాబు…!

త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న త‌ర్వాత సినిమా స్టార్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. అయితే సినిమా అనౌన్స్ అయి సంవత్సరం కావొస్తున్నా ఇప్ప‌టికి షూటింగ్‌
మొద‌లు పెట్టలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈనెల 21నుంచి ముద‌లు పెట్ట‌బోతున్నారు. ఈ సినిమా త‌ర్వాత తార‌క్ తన 31వ సిన‌మాను పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో చేయ‌బోతున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత తారక్ నటించబోయే సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు బుచ్చిబాబు ఇప్పటికే కథ చెప్పి ఒప్పించడం జరిగింది. ప్రస్తుతం చరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు తారక్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్ప‌ట్లో ప‌ట్టాలు ఎక్క‌క‌పోవ‌చ్చు. మరోవైపు ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించి ఆగిపోయిన విష‌యం తెలిసిందే.

Jr NTR sports fierce look in Prashanth Neel's NTR 31 - India Today

అయితే తారక్, త్రివిక్రమ్ మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయని ఈ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. వీరితో పాటు ఎన్టీఆర్‌తో ధ‌ర్శ‌క ధీరుడు రాజామౌళి కూడా ఓ సినిమా చేయ‌బోతున్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇక తార‌క్ 32వ సినిమా రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Rajamouli ignores Jr NTR

వీరితో పాటు ఎన్టీఆర్, కోలీవుడ్ ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేషన్‌లో కూడా ఓ సినిమా రాబోతుంది అని తెలుస్తుంది. అట్లీ ఇప్పటికే తారక్ కు కథ చెప్పినట్టు ప్రచారం జరిగింది. వీరితో పాటు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీతో కుడా ఓ సినిమా రాబోతుంది అన్నీ వార్త‌లు వ‌స్తున్నాయి. వీరితో పాటు తారక్ తో సినిమా చేయాలని టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.

After Prashanth Neel, NTR's next with this star director? | 123telugu.com

తారక్-రిషబ్ శెట్టి కాంబోలో ఓ సినిమా వ‌స్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్లలో ఏ కాంబినేషన్ కు తారక్ ఓకే చెబుతారో చూడాలి. ఎన్టీఆర్‌ పుట్టినరోజున తారక్ కొత్త సినిమాలకు సంబంధించి మరిన్ని ఆప్‌డ్టేట్స్ వ‌చ్చే ఛాన్స్ అయితే ఉంది.