బాల‌య్య ఫ్యాన్స్ కి బిగ్ షాక్‌.. ఇక `అన్ స్టాప‌బుల్‌` ముగిసిన‌ట్టే!?

నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇప్పుడు యాడ్స్ లో నటిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రారంభమైన టాక్‌ షో `అన్‌ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` తో హోస్ట్ గా మారారు. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్ ఎంత‌లా స‌క్సెస్ అయిందో చెప్ప‌క్క‌ర్లేదు. నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా రికార్డ్ సృష్టించింది.

అందుకు ప్ర‌ధాన కార‌ణం బాల‌య్య హోస్టింగే అన‌డంలో సందేహం లేదు. ఫ‌స్ట్ సీజ‌న్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఇటీవ‌ల రెండో సీజ‌న్ ను ప్రారంభించాడు. అది కూడా విజ‌య‌వంతంగా ముగిసింది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులెంద‌రో ఈ షోలో సంద‌డి చేశారు. ఇక మూడో సీజ‌న్ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని బాల‌య్య ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ, వారికి బిగ్ షాక్ త‌గ‌ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. `అన్ స్టాప‌బుల్‌`ఇక ముగిసిన‌ట్టే అని ఓ టాక్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

మ‌హేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, గోపీచంద్‌, శ‌ర్వానంద్‌ వంటి వాళ్ళు ఈ షో కి వచ్చేశారు. ఇంకా నేటి తరం స్టార్ హీరోలలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మాత్రమే రావాల్సి ఉంది. ఇక బాలయ్య తరం హీరోలైన చిరంజీవి, వెంకటేష్ మరియు నాగార్జున వంటి వాళ్ళు కూడా బ్యాలెన్స్ ఉన్నారు. వీళ్లందరితో సీజన్ 3 ప్లాన్ చెయ్యొచ్చు. కానీ వీళ్ల‌ను సీజన్ 2 లోనే పార్టిసిపేట్ చేయించేందుకు సంప్రదింపులు జరపగా.. ఆయా హీరోలు ఏ మాత్రం ఆస‌క్తి చూడ‌లేద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే సీజ‌న్ 2తోనే షోను ముగించాల‌ని మేక‌ర్స్ డిసైడ్ అయిన‌ట్లు టాక్ నుడ‌స్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది చూడాలి.