`వినరో భాగ్యము విష్ణు కథ`కి పాజటివ్ టాక్‌.. ఆ ఒక్క మైన‌స్ లేకుంటే కిర‌ణ్‌కి బ్లాక్ బ‌స్ట‌రే!

యంగ్ అండ్‌ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నంచి వ‌చ్చిన తాజా చిత్రం `వినరో భాగ్యము విష్ణు కథ`. జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇందులో కశ్మీర పరదేశి హీరోయిన్ గా న‌టించింది. ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, ఎల్బీ శ్రీరామ్ త‌దిత‌రులు కీల‌క పాత్రలను పోషించారు.

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. మ‌హా శివ‌రాత్రి పండుగ కానుక‌గా నేడు ఈ చిత్రం అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. నెంబర్ నైబరింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు. ఓ ల‌వ్ స్టోరీ, ఒక క్రైమ్ ఎలిమెంట్‌, దేశభక్తి, ఇతరులకు సాయం చేయడం వంటి అంశాల‌తో ఎంతో చక్కగా దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దాడు.

కొత్త కథ, అలరించే ట్విస్ట్స్‌, ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్, కిరణ్ అబ్బవరం యాక్టింగ్, మురళీ శర్మ కామెడీ సినిమాకు హైలెట్స్ గా నిలిచాయి. దీంతో మెజారిటీ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. విష్ణు పాత్ర‌లో కిర‌ణ్ ప‌క్క‌టి కుర్రాడిలా చ‌క్క‌గా ఒదిగిపోయి న‌టించాడు. మొత్తానికి టాక్ అయితే బాగుంది. కానీ, సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయ్యిందని, ఆ ఒక్క మైన‌స్ లేకుంటే కిర‌ణ్ కి బ్లాక్ బ‌స్ట‌రే అని అంటున్నారు.