సీరియల్ మోజులో అలాంటి తప్పు చేసిన ప్రేమి విశ్వనాధ్..? వంటలక్కలో ఈ యాంగిల్ కూడా ఉందా బాసూ..!!

ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరు చెప్తే జనాలు చాలా తక్కువ మంది గుర్తుపడతారు . అదే వంటలక్క అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనాలు ఓ రేంజ్ లో ఎగబడి పోతారు. దానికి మెయిన్ రీజన్ కార్తీకదీపం ద్వారా ఆమె తెచ్చుకున్న క్రేజ్ .. పాపులారిటీ అని చెప్పాలి . ఎస్ స్టార్ మా చానల్లో టెలికాస్ట్ అయినా కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథన్ వంటలక్కగా గుర్తింపు సంపాదించుకుంది . ఈ సీరియల్ లో వంటలక్క పాత్రగా ఆమె నటించిన నటన తీరు జనాలను మర్చిపోలేకుండా చేసింది .

ఎంతలా అంటే వంటలక్క అంటే .. తమ ఇంట్లో ఒక మనిషిలానే భావిస్తూ ఉన్నారు. జనాలు అప్పట్లో వంట చేసే మనుషులు కి పెద్దగా వాల్యూ ఉండేది కాదు ..కానీ కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రను చూసిన తర్వాత వంట చేసే వాళ్లకు అంత గౌరవం ఇస్తున్నారు. అంతలా తెలుగు రాష్ట్రాలలో మార్పు తీసుకొచ్చింది వంటలక్క. అయితే ఈ సీరియల్ లో ప్రేమి విశ్వనాధ్ నల్లగా కనిపిస్తూ ఉంటుంది . అందం లేకపోయినా సరే ప్రేమతో ఎలాంటి పనులైనా సాధించుకోవచ్చు అని ప్రూవ్ చేస్తూ ఉంటుంది .

అయితే నిజానికి ప్రేమ విశ్వనాధ్ అంత నలుపు ఏమి కాదు ..అలా అని అంత తెలుపు కాదు ..మిడిల్ గా చామంఛాయగా ఉంటుంది . అయితే ఈ సీరియల్ లో ఆమె ఇంకా నల్లగా కనిపించడానికి నల్లగా ఉంటే మేకప్ ఎక్కువగా వాడారు. అయితే దీని వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ ఇరిటేషన్ వస్తుందని ముందు ఆమెకు తెలియదట . ఈ క్రమంలోనే సీరియల్ స్టార్ట్ అయిన కొన్ని వారాలకే ఆమెకు ఫేస్ అంత దద్దుర్లు మొటిమలు మంట వచ్చేసిందట .

ఈ క్రమంలోనే డాక్టర్లు సంప్రదించగా ఇది అంతా మేకప్ వల్లె అంటూ చెప్పుకొచ్చారట . అయినా సగంలో కమిటీ అయినా సీరియల్ నుండి వెనక్కి రాలేక ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూనే సీరియల్ కొనసాగిచ్చిందట .అంతలా తాను అనుకున్న పని చేయడానికి ఎలాంటి ఇబ్బందులు నైనా పడుతుంది ప్రేమి విశ్వనాధ్ అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . నిజానికి ఈమె మలయాళీ సినీ ఇండస్ట్రీకి చెందిన ఆమె ..తెలుగులో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ అని చెప్పుకొచ్చింది. ప్రెసెంట్ ప్రేమి విశ్వనాథ్ పలు తెలుగు సినిమాల్లో కూడా కీలకపాత్రలో నటిస్తుంది..!!

Share post:

Latest