తారకరత్న అంటే ఎన్టీఆర్‌ కి అంత కోపమా..? ఆరోగ్యంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం అదేనా?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి తారకరత్న అంటే జూనియర్ ఎన్టీఆర్ కి అంత కోపమా..? అందుకే అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఆరోగ్యం పై ఒక్క మాట కూడా మాట్లాడలేదా ..? అంటూ పలువురు యాంటీ నందమూరి ఫ్యాన్స్ నందమూరి హీరోస్ ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న జనాల తాకిడికి స్పృహ తప్పి పడిపోయాడు.

 

ఈ క్రమంలోనే ఆయనకు కార్డియార్టిక్ అరెస్ట్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు . మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి షిఫ్ట్ చేసిన డాక్టర్లు ప్రెసెంట్ ఆయన ఆరోగ్యం పరిస్థితి క్షేమంగానే ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే తారకరత్న హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రెండు మూడు రోజులు నానా హంగామా చేస్తూ హెల్త్ బులిటెన్ అంటూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిన డాక్టర్లు గత మూడు రోజుల నుంచి ఏం మాత్రం ఆయన ఆరోగ్యం పై స్పందించకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది . అంతేనా రీసెంట్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ రామ్ ..నందమూరి తారక్ ..తారకరత్న హెల్త్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.. కనీసం ఇలా జరిగినందుకు బాధపడుతున్నామంటూ కూడా మాట్లాడలేదు.

దీంతో ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి నందమూరి ఫ్యామిలీకి తారకరత్న దూరంగానే ఉంటూ వస్తున్నాడు . దానికి కారణాలు మనకు తెలిసిందే . అయితే ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో కూడా నందమూరి హీరోలు తారకరత్న ని దూరం పెడుతున్నారా ..? అంత తప్పుడు పని ఆయన ఏం చేశారు ..? ఎన్టీఆర్ ఒక్క మాట తారకరత్న ఆరోగ్యం పై మాట్లాడి ఉంటే ఇంత గోల వచ్చేది కాదు కదా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం పై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం ఇవ్వకపోవడం కూడా నందమూరి ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ పుట్టిస్తుంది .

దీంతో నందమూరి హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే అందుతున్న సమాచారం ప్రకారం హెల్త్ గురించి ఆ ఈవెంట్ లో మాట్లాడకపోవడానికి కారణం మేకర్స్ అని తెలుస్తుంది. అలా మాట్లాడితే సినిమా ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అంటూ మేకర్స్ ముందు జాగ్రత్తగా పడ్డారని తెలుస్తుంది .అంతే కాదు తారక్ ఆరోగ్యం కూడా ఏమీ బాగోలేదు.. ఇదే విషయాన్ని ఆయన స్టేజిపై కూడా చెప్పుకొచ్చాడు..!!