ఈ సినిమాలు 1000 కోట్లు సంపాదించకపోతే నష్టాలు తప్పవు.. అవేంటంటే…

 

టాలీవుడ్‌లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రూ.1,000 కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాకి మంచి టాక్ వస్తే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. అయితే ఈ ఏడాది 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే…

 

ఇటీవలే రిలీజ్ అయ్యి రూ.1,000 కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంది పఠాన్ సినిమా. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప 2 కూడా సులభంగా 1000 కోట్లు వసూలు చేస్తుందని చాలామంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకులో కాస్త అసంతృప్తి మొదలయింది. కాబట్టి ఆదిపురుష్ సినిమా 1000 రీచ్ అవ్వడమే కష్టమే. కానీ ప్రభాస్ నటించిన ఇంకో సినిమా ‘సలార్ ‘ మాత్రం సులభంగా 1000 కోట్లు రీచ్ అవుతుంది అని కామెంట్స్ వస్తున్నాయి.

శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాక్. ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న సినిమా కూడా కాస్త పాజిటివ్ టాక్ వస్తే ఈజీ గా 1000 కోట్లు తమ ఖాతాలో వేసుకోవచ్చు. అంతేకాకుండా సీనియర్ స్టార్ హీరోలు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే 1000 కోట్ల రేంజ్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. నిజానికి పాన్ ఇండియా సినిమాలో వేయి కోట్ల కలెక్షన్స్ వస్తే నిర్మాతల పంట పండినట్టే.

Share post:

Latest