“అలా జరగడం నాకు చాలా చాలా హ్యాపీగా గా ఉంది”.. నాగచైతన్య కామెంట్స్ వైరల్..!!

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే . జోష్ సినిమాతో అప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ..ఇప్పటివరకు పట్టుమంటే పది హిట్లు కూడా కొట్టలేకపోయారు . మిగతా స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలని.. 100 కోట్ల క్లబ్ లోకి అంటూ దూసుకుపోతుంటే ..నాగచైతన్య మాత్రం ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి స్టోరీస్ నే చేసుకుంటూ కాలాన్ని సాగదీస్తున్నారు. ఈ క్రమంలోని నాగచైతన్య లాస్ట్ గా నటించిన రెండు సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి .

అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడానికి నాగచైతన్య పక్కాగా ప్లాన్ చేస్తున్నారు . ఈ క్రమంలోని వెంకట్ ప్రభు తెరకెక్కించిన ద్విభాష చిత్రం “కస్టడి” సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు . శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. కాగా మే 12 గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ ప్రియమణి.. విలన్ పాత్రలో అరవింద స్వామి నటించడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఈ సినిమాలో నాచురల్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది .

రీసెంట్ గా “రాజా లైవ్ ఇన్ కన్స్ర్ట్” కోసం మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ ఇళయరాజా హైదరాబాద్ కి వచ్చారు. ఈ సందర్భంగా కస్టడీ సినిమా యూనిట్ ఇళయరాజను ప్రత్యేకంగా కలిసి అభినందించింది. దానికి మెయిన్ రీజన్ కస్టడి సినిమాకి ఇళయరాజా సంగీతం అందించడమే . కాగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే నాగచైతన్య ఇళయరాజని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. “ఇళయరాజని కలవడం గొప్ప సంతోషాన్నిస్తుంది.. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూనే పెరిగాను.. నాకు ఎంతో ఇష్టం. నా సినిమా కోసం రాజా సార్ మ్యూజిక్ కంపోజ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ..లైఫ్ లో ఈ మూమెంట్ మర్చిపోలేను ” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు చై. ఈ క్రమంలోనే నాగచైతన్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఇంత సంతోషంగా ఎప్పుడూ లేడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకు వస్తున్నారు..!!

Share post:

Latest