ఎక్స్ క్లూజివ్: సొంత ఫ్యాన్సే పవన్ కి శత్రువులుగా మారారా..? అభిమానం పేరుతో ముంచేస్తున్నారా..?

ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు . ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల కోసం సినిమాలను ఆపుకొని మరి ప్రజల కోసం రాజకీయ రంగంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోతున్నారు. కాగా 2024లో జరగబోయే ఎలక్షన్స్ లో కచ్చితంగా గెలిచి ముఖ్యమంత్రిని అవుతానన్న ధీమా వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్.. అలాగే పావులు కదుపుతున్నాడు .

కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి కి పట్టు చీరను సమర్పించారు . = మనకు తెలిసిందే కనుక కనకదుర్గమ్మ అమ్మవారు ఎంత శక్తివంతమైనదో ..ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి చీరను సమర్పించారు . దానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సాధారణంగా ఇలా అమ్మవారికి వచ్చిన చీరలు వేలం వేస్తూ ఉంటారు ..మరి కొన్నిసార్లు తాము ఎంత ఖరీదు పెట్టి చీర కొన్నాము అంత మొత్తం అమ్మవారికి చెల్లించి అమ్మవారికి ఇచ్చిన చీరను తిరిగి తీసుకెళ్తూ ఉంటారు కొందరు భక్తులు.

సాధారణంగా దుర్గమ్మకు ఇచ్చే వస్త్రాలు విషయంలో ఇలానే జరుగుతూ ఉంటుంది . అయితే ఫస్ట్ టైం ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ గుడిలో రూల్స్ కి భిన్నంగా జరిగింది . పవన్ కళ్యాణ్ అమ్మవారికి సమర్పించిన చీర మాకు కావాలంటే మాకు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పోటాపోటీగా తలపడుతున్నారట. అంతేకాదు ఈ చీరను చూడడం కోసం రోజుకి భారీ సంఖ్యలో అభిమానులు ఆలయానికి వస్తున్నారని.. ఎక్కడెక్కడ నుంచో తమకు ఫోన్లు చేసి వివరాల కోసం సేకరిస్తున్నారని ..శారీ కౌంటర్ నిర్వాహకులు వెల్లడించారు .

ఈ తలనొప్పులు ఈ ఒత్తిడి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన చీరను తిరిగి మళ్లీ అమ్మవారి ఆశీస్సుల రూపంలోనే ఆయనకు కానుకగా ఇవ్వడానికి శారీ కౌంటర్ నిర్వహకులు భావిస్తున్నారట . దేవుడికి సమర్పించిన వస్త్రాలు విషయంలో ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదు. అయితే దీనికి అంతటికి కారణం పవన్ ఫ్యాన్సే అంటున్నారు కొందరు నెటిజన్స్ . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరీ ఓవర్గా చేస్తున్నారని.. ఆయనకు ఫ్రీడం లేకుండా ..ఆయనను ఆయన ఫ్యాన్సే తొక్కేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపించడం సంచలనంగా మారుతుంది. అంతేకాదు కొందరు హద్దులు మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదుపులో ఉంటేనే పవన్ కళ్యాణ్ కచ్చితంగా సీఎం అవ్వగలడు అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. చూద్దా,..ఈ పవన్ ఫ్యాన్స్ ఏం చేస్తారో..?

Share post:

Latest