సినీ హీరో సుమన్‌పై చిరు కీలక వ్యాఖ్యలు.. సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ హీరోను పలువురు ఆకాశానికి ఎత్తేస్తారు. తర్వాతి సినిమా ప్లాఫ్ అయితే పాతాళానికి పడేస్తారు. ఇలాంటి ఎత్తుపల్లాలు అందరి జీవితంలోనూ జరుగుతుంటాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సినీ హీరో సుమన్‌ విషయానికి వస్తే ఇటీవల ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరుపురాని పాత్రలను పోషించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో 1980, 90 దశకంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. చిరంజీవితో సమానంగా ఆయనకు క్రేజ్ ఉండేది. స్వతహాగా అందగాడు, పైగా కరాటే ఫైటర్ కావడంతో ఆయనంటే అభిమానులు పడి చచ్చేవారు. ఆయన కెరీర్ ఒక్క ఘటనతో పతనమైనా, తిరిగి మరింత బలంగా ఆయన పుంజుకున్నారు. తాజాగా ఆయనపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

చిరంజీవి-సుమన్‌లకు ఒకరంటే ఒకరికి పడదని, ఒకరకంగా సుమన్‌ కెరీర్ పతనానికి చిరంజీవి కారణమనే వదంతులు చాన్నాళ్లుగా ఉన్నాయి. అయితే వాటన్నిటినీ ఇద్దరు హీరోలూ కొట్టి పడేశారు. తాజాగా చిరంజీవి ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేశారు. అందులో సుమన్ 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని కొనియాడారు. విలక్షణమైన శైలితో, 10 భాషల్లో 500లకు పైగా సినిమాలలో నటించడం అంటే సాధారణ విషయం కాదన్నారు.


సినిమా పట్ల ఆయన హార్డ్ వర్క్, కమిట్‌మెంట్ ఏంటో ఆయన సినిమాలో చెబుతాయని అన్నారు. వెండితెరపై మరిన్ని సినిమాలు చేయాలని, దేవుడి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. ఇక పలు సందర్భాల్లో సుమన్ తనకు మంచి స్నేహితుడని, అతడితో ఎలాంటి విభేదాలు లేవని చిరంజీవి చెప్పారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.

Share post:

Latest