ఆ రేర్ రికార్డ్‌ 30 ఏళ్ల తర్వాత రిపీట్ చేస్తోన్న‌ బాలయ్య..!

నటసింహ నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మ కాల సినిమాతో బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య.. తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేయాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే అంతగా అలరించాడు.

HBDNandamuriBalakrishna: హీరోగా నందమూరి బాలకృష్ణ ప్రత్యేకతలు ఇవే.. | These  are the Specialities of Tollywood Senior Top Hero Nandamuri Balakrishna..Here  are the Details– News18 Telugu

ఇలా మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, అఖండ, వీర సింహారెడ్డి ఇలా బాలకృష్ణ నటించిన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే ఆయన నట విశ్వరూపంతో ఉగ్ర నరసింహుడిలా చెలరేగిపోయి చరిత్ర సృష్టించే విజయాలు అందుకున్నాడు.

HBD Balakrishna : 48 యేళ్ల ఫిల్మీ కెరీర్.. 106 సినిమాలు.. 126 హీరోయిన్స్‌తో  రొమాన్స్ ఇది బాలయ్య లెక్క.. | Happy Birthday Nandamuri Balakrishna Do You  Know Facts About Balayya Cine Journey ...

2004 లో వచ్చిన లక్ష్మీ నరసింహ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక‌ 2010 ఏప్రిల్ 30 సింహ వచ్చే వరకు సరైన హిట్ అందుకోలేకపోయాడు. వరస పరాజయాల్లో, వాటిల్లో కొన్ని ఘోర‌మైన డిజాస్ట‌ర్లు అయ్యాయి. దీంతో బాలకృష్ణ పని అయిపోయిందని అనుకున్న సమయంలో సింహా సినిమాతో జూలు విదిల్చి గర్జించాడు. 80వ‌ దశకంలో ఒకే సంవత్సరం వరుసగా ఆరు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డు బాలయ్యకే సొంతం.

Balakrishna: టైటిల్‌లో 'సింహా' పేరుతో నట సింహం బాలకృష్ణ చేసిన సినిమాలు  ఇవే.. | Nandamuri Nata Simham Balakrishna Done Many Movies Titles Simha  Name Here Are The list ta– News18 Telugu

ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకొని మూడోది ప్లాఫ్ అవడం వల్ల హ్యాట్రిక్ కూడా కూత వేటు దూరంలో ఆగిపోయాడు బాలయ్య. కట్ చేస్తే ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. మళ్లీ ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు రిపీట్ చేయబోతున్నారంటూ.. టాలీవుడ్ వర్గాలతో పాటు ఆయ‌న‌ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో అఖండతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు.

ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి తో తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. రెండు బంపర్ హిట్‌ల‌ తర్వాత బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న బాలకృష్ణ 108వ‌ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని 30 సంవత్సరాల బాలయ్య రికార్డును మళ్ళీ గుర్తు చేస్తుందని అభిమానులు అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..!