షూటింగ్‌కు తాగి వ‌చ్చిన డైరెక్ట‌ర్‌… బాల‌య్య ప‌ట్టుకుని వాయించేశాడా…!

నందమూరి హీరోల గురించి కొన్ని కామెంట్స్ మనం వింటూ ఉంటాం మరి ప్రధానంగా క్రమశిక్షణ అనే మాట వారి దగ్గర నుంచి ఎక్కువగా వినబడుతుంది. వారు చేసే సినిమాలకు షూటింగ్ కి సమయానికి వచ్చి తమ పనిని కచ్చితంగా పూర్తి చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి తరం నందమూరి హీరోలు అందరూ కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారని వారి సినిమాల షూటింగ్ సమయాని కంటే గంట ముందే వస్తారని చెబుతారు. మరి బాలకృష్ణ అయితే ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.

ఆయన ఏ దర్శకులతో అయినా సినిమా మొదలు పెట్టే ముందే వారికి కచ్చితంగా చెప్పి ఆ సినిమాల షూటింగ్‌ల‌ను మొదలు పెడతారట. ఇక ఆ సినిమాల‌ షూటింగ్ లో ఆయన చెప్పిన విధంగా జరగకపోయినా ఎవరైనా తప్పు చేసినా సరే వారిపై సీరియస్ అవుతారని అంటారు. ఇప్పుడు అలా బాలకృష్ణ ఓ దర్శకుడు విషయంలో బాగా సీరియస్ అయ్యాడు. బాలయ్య సీరియస్ అయినా దర్శకుడు ఎవరు ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణతో వీరభద్ర సినిమాను తెరకెక్కించిన రవికుమార్ పై బాలయ్య సీరియస్ అయ్యారని తెలుస్తుంది.

బాలకృష్ణ సినిమా వల్ల నష్టపోయానన్న నిర్మాత.. అసలేమైందంటే | Star Producer  Ambika Krishna Comments About Balakrishna Veerabhadra Movie Details, Ambika  Krishna, Balakrishna, Ravikumar Chowdary, Sada ...

బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమా తర్వాత సింహ సినిమా వరకు ఆయనకు సరైన హిట్ పడలేదు. ఆ సమయంలో హిట్ దర్శకులతో చర్చలు జరుపుతున్న బాలయ్య గోపీచంద్ తో యజ్ఞం సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన రవికుమార్ కు కమిట్ అయ్యాడు. ఆయనతో వీరభద్ర సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు అంబికా కృష్ణ నిర్మాతకి వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ డైరెక్టర్ తాగి వచ్చేవారు అని సమయానికి రాలేదు అని విమర్శలు రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారని ఒక సందర్భంలో కొట్టారని టాక్ వచ్చింది. నిర్మాత అంబికా కృష్ణ కూడా ఇదే చెప్పారు అప్పుడు..తనకు చాలా నష్టం జరిగిందని కూడా అన్నారు. అయితే దీనిపై రవికుమార్ క్లారిటీ ఇచ్చారు.

Share post:

Latest