సినిమాలు చేసే ఆలోచన ఇక లేదు… ‘జయమ్మ’ షాకింగ్ డెసిషన్?

మీకు జయమ్మ అనగానే ఎవరు గుర్తుకువస్తున్నారు? పోనీ బుల్లి తెర నెంబర్ వన్ లేడీ యాంకర్ అంటే ముందుగా మీకు ఎవరు గుర్తుకువస్తున్నారు? అవును, మీరు ఊహించింది నిజమే. ఆవిడే బుల్లితెర సూపర్ స్టార్ సుమ. యాంకర్ సుమ ఏ కార్యక్రమం చేసినా అది సూపర్ హిట్ అనడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈమె రెమ్యూనరేషన్ ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినబడుతోంది. ఒక నెలలో దాదాపు 20 రోజులు ఆమె ఏదో ఒక షూటింగ్స్ తో బిజీగా వుంటూ ఉంటుంది.

ఇకపోతే యాంకర్ సుమ ఆ మధ్య జయమ్మ పంచాయితీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి ఆమెకు జయమ్మ అనే నామకరణం ఉండిపోయింది. ఇపుడు ఆమెను కొంతమంది జయమ్మ అని పిలుస్తూ వుంటారు. కాగా ఆ సినిమా ఫలితం ఎలాగున్నా సుమ చేసిన పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సుమను ఓ ప్రముఖ నిర్మాత ఒకరు తమ బ్యానర్ లో నటించేందుకు అడిగారట. అయితే సుమ నటించడానికి మాత్రం నో చెప్పిందని తెలుస్తోంది.

వేరొకరైతే ఆ అవకాశాన్ని వదులుకోరు. కానీ యాంకర్ సుమ ఆ అవకాశాన్ని తృణప్రాయంగా వదిలేయడంతో రకరకాల గుసగుసలు వినబడుతున్నాయి. ఆమె పూర్తిగా బుల్లి తెరకే అంకితం అయిపోవాలని డిసైడ్ అయిపోయిందట. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు ఉంది. సినిమాలు చేసి దాన్ని పాడు చేసుకోక పోవడమే మంచిది అని భావిస్తుందట. ఈ మాటలను వెనక వాస్తవం ఎవరికెరుకగాని సోషల్ మీడియాలో మాత్రం ఇదే విషయం ఇపుడు చక్కెర్లు కొడుతోంది. ఇకపోతే సుమ యాంకరింగ్ కి వున్న డిమాండ్ అంతాఇంతా కాదు. పెద్ద పెద్ద హీరోలు సైతం తమ ఫంక్షన్లకు సుమనే యాంకరింగ్ కి పిలుస్తారు.