ఈ న‌లుగురు స్టార్ హీరోల్లో డేంజ‌ర్ జోన్లో ఉన్న హీరోలు ఎవ‌రు…!

చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తున్నా అవే క‌లిసొస్తున్నాయి.

చిరంజీవి ఇప్పుడూ అవే తరహా కథలను ఎంచుకుంటే మాత్రం ఇప్పుడు ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుందని కామెంట్లు కూడా వస్తున్నాయి. బాలకృష్ణ కూడా డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలు ఆయనకు హిట్లు ఇస్తున్నాయి. ఆ సినిమాల్లో ఆయన వయసు మళ్ళిన పాత్రల్లో, ఎక్కువ ఏజ్ ఉన్న పాత్రలో బాలయ్య తన నట్ట విశ్వరూపం చూపిస్తున్నారని సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో ఫ్రూవ్ అయ్యింది.

మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఆయనకు భిన్నమైన కథలు మాత్రమే కలిసి వస్తున్నాయి. దృశ్యం, దృశ్యం2 వంటి తరహా సినిమాలు వెంకటేష్ స్థాయిని పెంచుతున్నాయని… ఇక వెంకీ తన కథల విషయంలో కరెక్ట్ గానే ఉన్నారని కామెంట్లు వస్తూ ఉండటం గమనార్హం. అంతేకాకుండా వెంకటేష్ తన రెమ్యూనిరేషన్ కూడా భారీ స్థాయిలో ఉందని కూడా కామెంట్లు వస్తున్నాయి.

Nagarjuna issued notice over alleged illegal construction work in Goa, know  details | Celebrities News – India TV

మరో హీరో నాగార్జున విషయానికి వస్తే ఆయన చేసే సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాయి. ఆయన చేసే సినిమాలు ఎక్కువ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలే ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. నాగార్జున అలాంటి కథలను ఎంచుకుంటే మంచిది. ఈ సీనియర్ స్టార్ హీరోలు వారి అభిమానులకు నచ్చే కథలను ఎంచుకుంటూ ట్రెండకు అనుగుణంగా కొన్ని విషయాల్లో మారితే వారికి విజయాలు ఖచ్చితంగా వస్తాయని కామెంట్లు వస్తున్నాయి.

ఈ టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టార్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. వారికి మల్టీ స్టార్ సినిమాలే బెస్ట్ ఆప్షన్ అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ హీరోల నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.

Share post:

Latest