ఆ ఒక్క మాట తో యాంకర్ సుమ దూల తీరిపోయిందా..? అయ్యయ్యో మళ్ళీ బుక్కైపోయిందే..!!

పాపం .. యాంకర్ సుమ ఎప్పుడు చలాకీగా గలగల నవ్వుతూ నాన్ స్టాప్ గా వాగేస్తూ ఉండే సుమ నిన్న జరిగిన “సార్” ఫ్రీ రిలీజ్ మూవీ ఈవెంట్ లో మాత్రం చాలా సైలెంట్ గా ఉండింది . జనరల్ గా సుమ అంటే అందరూ ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఆమె మాటలే . ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ..సరదాగా ..హెల్తీ పంచెస్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది .

మిగతా యాంకర్స్ అందరూ వల్గర్ పంచెస్ వేస్తూ బూతు పదాలను వాడుతూ ఉంటే ..యాంకర్ సుమ మాత్రం సైలెంట్ గానే ఫ్యామిలీ అందరూ నవ్వుకునే పంచెస్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటుంది . కాగా రీసెంట్గా అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. టంగ్ స్లిప్ అయ్యింది. ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తాడు ఎన్టీఆర్ అంటూ మాట్లాడింది . ఈ క్రమంలోనే స్టేజిపై తారక్ సీరియస్ అయ్యాడు . దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనకి తెలిసిందే.

అప్పుడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాంకర్ సుమపై మండిపడ్డారు . ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ కొందరు హద్దులు మీరి కామెంట్స్ చేశారు. అంత ఎందుకునిన్న ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా అంత సరదాగా మాట్లాడుతుంటే.. సుమ కేవలం నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చింది తప్పిస్తే ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేదు. అరాకొరా కౌంటర్స్ వేస్తూ తప్పించుకునింది అంతే. అదే ఒకప్పటి సుమ అయితే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి చుక్కలు చూపించేసి ఉండేది . కానీ ఎన్టీఆర్ గుర్తొచ్చాడో..వేరే కారణం ఏమైనా ఎందేమో ..లేక ఈ తలనొప్పి నాకు ఎందుకు రా బాబు అనుకునిందో తెలియదు కానీ సార్ ఈవెంట్ లో సైలెంట్ గా ఉండింది. అందుకే యాంకర్ సుమను పలువురు పరోక్షకంగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు..!!

Share post:

Latest