తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డ్.. కాలర్ ఎగరేయండి రా మహేశ్ ఫ్యాన్స్..!!

ఇది నిజంగా ఘట్టమనేని అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ వింటూ బాధపడిపోతున్న మహేష్ బాబును చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ రీసెంట్ గానే మరణించారు ..అంతకుముందే మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు అనారోగ్య కారణంగా మరణించారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3నెల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు ఎంత అల్లాడిపోయారో.. కుమిలి కుమిలి ఏడ్చారు మనం చూసాం .దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .

ఎట్టకేలకు ఆ బాధ నుంచి కోల్కొని మహేష్ బాబు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ అవ్వగానే మహేష్ బాబు నెక్స్ట్ దర్శకతీరుడు రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన మాటల ప్రకటన కూడా వచ్చేసింది . కాగా ఇప్పటివరకు స్టార్ట్ కాని ఈ సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. కాగా కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులకే దాదాపు 17 కోట్లను ఖర్చు చేస్తున్నాడు రాజమౌళి అంటూ ఓ న్యూస్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే ఈ స్థాయిలో బడ్జెట్ ని పెంచుకుంటూ పోతున్న రాజమౌళి సినిమాను ఇంక ఏ రేంజ్ లో తెరకేకిస్తాడో అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు బెస్ట్ అవుట్ పుట్ కోసం .. ఖర్చు విషయంలో వెనకాడని జక్కన్న మహేష్ బాబును సరికొత్తగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది .ఇంతటి క్రేజీ గుడ్ న్యూస్ విన్న తర్వాత మహేష్ అభిమానులు ఊరుకుంటారా ..రచ్చ రంబోలా చేసేయరు.. ప్రజెంట్ అదే సోషల్ మీడియాలో జరుగుతుంది..!!

Share post:

Latest