టాలీవుడ్ లో వరుస అపశకునాలు…ఆ పాపమే శాపంగా మారిందా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి అపశకునాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో 9 సంవత్సరాల కిందట ఇలా కొద్ది గ్యాప్ లోనే టాలీవుడ్ ప్రముఖులని కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే రిపీట్ అవ్వడం బాధాకరం. ఇప్పుడు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమైందని చర్చ మరోసారి మొదలైంది.
డిసెంబర్ నెల నుంచి టాలీవుడ్ లో వరుస విషాదాలు పట్టి పీడిస్తున్నాయి.

టాలీవుడ్ లో వరుస మరణాలు...9 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన బ్యాడ్ సెంటిమెంట్ | Serial deaths in Tollywood bad sentiment repeated after 9 years ,Death row , Tollywood bad sentiment , Srihari , Avs ...

కైకాల సత్యనారాయణ, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్ మరణంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త సంవత్సరంలో కూడా వరుస విషాదాలను వినాల్సి వస్తుంది.అలనాటి మేటినటి సత్యభామ జమున, కళాతపస్వి కె.విశ్వనాథ్ కొద్ది రోజుల గ్యాప్ లోనే మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు మరో గట్టి షాక్ తగిలినట్టు అయింది. ఈ బాధ నుంచి బయటికి రాకముందే లెజెండ్రీ సింగర్ వాణి జయరాం మృతి తెలుగు చిత్ర పరిశ్రమను ఇంకా కలచివేసింది.

సినిమా ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ఐదు నెలల్లో ఆరుగురి దిగ్గజాల కన్నుమూత.. కన్నీళ్లు పెట్టుకుంటోన్న కళామతల్లి | Vani jayaram jamuna k vishwanath krishna ...

వీరితోపాటు సీనియర్ దర్శకులు సాగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తిని కూడా పోగొట్టుకుంది.ఇదేవిధంగా 2015 చివర్లో కూడా ఇలాంటి వరుస విషాద ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇక ఆ సంవత్సరం మ్యూజిక్ సన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి, రచయిత శ్రీనివాస్ చక్రవర్తి, సీనియర్ నటుడు రంగనాథ్, ఇలా కొద్దిరోజుల వ్యవధిలోనే మరణించారు.

ఇదే విధంగా 9 సంవత్సరాల కిందట టాలీవుడ్ అగ్ర కమెడియన్లు కూడా ఇదేవిధంగా రోజుల వ్యవధిలోనే మరణించారు. ఆ సమయంలో మా ఆధ్వర్యంలో టాలీవుడ్ లో యాగాలు, శాంతి పూజలు కూడా జరిపించారు. ఇలా మరోసారి ఇప్పుడు జరుగుతున్న మరణాలను చూసి పాత విషాదాలను గుర్తు చేసుకుంటుంది టాలీవుడ్.