యంగ్ బ్యూటీ శ్రీలీల చేస్తున్న ఆ తప్పే ..కృతి శెట్టికి ప్లస్ అవుతుందా..? ఏం ప్లానింగ్ తల్లి నీది..!!

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కన్నడ బ్యూటీ శ్రీ లీల తన కెరియర్ విషయంలో చేస్తున్న తప్పులే మరో యంగ్ బ్యూటీ కృతి శెట్టి కి ప్లస్ అవుతుందా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే శ్రీ లీల – కృతి శెట్టి ఇద్దరూ ఒకే వయసుకు చెందిన అమ్మాయిలు .

మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇద్దరు ఒకే టైం కి అడుగుపెట్టి .. ఇద్దరు బ్లాక్ బస్టర్ విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. కాకపోతే కృతి శెట్టి కొంచెం తొందరపడి ఇప్పటికే ఆరు సినిమాలో నటించి మూడు హిట్లు – మూడు ఫ్లాపులు తన ఖాతాలో వేసుకొని కెరియర్ గ్రాఫ్ ఈక్వల్ చేసుకుంది . రీసెంట్ గా శ్రీలీల నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది .

అంతేకాదు ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది శ్రీలీల . ఇలాంటి క్రమంలోనే శ్రీలీల రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ స్టార్ హీరో అవకాశాలను సైతం వదులుకుంటుంది . దీంతో ఆ సినిమాలన్నీ కృతి శెట్టి ఖాతాలోకి వచ్చి చేరుతున్నాయి. అలా మెగా హీరో సినిమా రిజెక్ట్ చేసిన శ్రీ లీల బిగ్గెస్ట్ తప్పు చేసిందని ..ఆ ఆఫర్ కృతి శెట్టి ఖాతాలో పడింది అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ శ్రీలీల ఇదే తప్పు కంటిన్యూ చేస్తే కచ్చితంగా కెరియర్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు జనాలు..!!